ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభం, జూలై 12 నుంచి ఆన్‌లైన్ క్లాసులు

Andhra Pradesh Govt Has Decided to Reopen Schools, Andhra Pradesh to reopen schools from August 16, AP Govt Decides to Starts Schools, AP Govt Decides to Starts Schools from August 16th, AP School Reopening, AP School Reopening News, AP School Reopening Updates, Mango News, School reopening in Andhra Pradesh, School Reopening Live Updates, School Reopening Live Updates 2021

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆగస్టు 16వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. బుధవారం నాడు విద్యాసంస్థల్లో నాడు-నేడు, జగనన్న విద్యా కానుకపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అలాగే జూలై 12 నుంచి ఆన్‌లైన్ క్లాసులను ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు విద్యాసంస్థల్లో నాడు–నేడు కింద చేపడుతున్న పనుల్లో పెండింగ్ లను ఆగస్టులోపు పూర్తి చేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలిచ్చారు. ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభించనున్న నేపథ్యంలో ఆగస్టు 15 లోపులోనే ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌ వేసేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. విద్యా కానుక పంపిణీ, నాడు-నేడు రెండో విడత పనులు ఆగస్టులోనే ప్రారంభం కావాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.

మరోవైపు ఏపీలో నూతన విద్యావిధానాన్ని చేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు ఉపాధ్యాయులకు వర్క్ బుక్స్ పై శిక్షణనిస్తామని చెప్పారు. ఇక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాలకు సంబంధించి 70 శాతం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్కులు, 30 శాతం పదో తరగతి నుంచి మార్కులను పరిగణనలోకి తీసుకుని మార్కులను వేస్తామని, ఈ నెలాఖరులోపుగానే విద్యార్థులకు మెమోలను విడుదల చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + four =