జీవో నెంబర్ 1ను జనవరి 23 వరకు సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ

AP High Court Suspends GO Number 1 Till January 23rd Orders Govt to File Counter,AP High Court Suspends,GO Number 1 Till January 23rd, Orders Govt to File Counter,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

రాష్ట్రంలోని జాతీయ, మున్సిపల్‌, పంచాయతీ రాజ్ రహదారులపై మరియు రోడ్డు మార్జిన్ల వద్ద సభలు, ర్యాలీల నిర్వహణను నియంత్రిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే జీవో నెంబర్ 1 తో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1పై ఏపీ హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు ఇచ్చింది. జీవో నెంబర్ 1 ను జనవరి 23వ తేదీ వరకూ సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇస్తూ, తదుపరి విచారణ జనవరి 20వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

ముందుగా జీవో నెంబర్ 1ను రద్దు చేయాలని కోరుతూ సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా పిటీషనర్ తరపు న్యాయవాది, రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు విన్పించారు. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం, జీవో 1ను ఈ నెల 23 వరకు సస్పెండ్ చేస్తూ, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాగా ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 జారీ చేసినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ జీవోను రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 12 =