స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష, ఆగస్టు 25న నేతన్ననేస్తం, సెప్టెంబర్ 22న వైఎస్ఆర్ చేయూత

AP CM YS Jagan held Video Conference with Collectors SPs as part of Spandana Program, AP CM YS Jagan Mohan Reddy held Video Conference with Collectors, Video Conference with Collectors And SPs, Video Conference on Spandana Programme, AP CM YS Jagan Mohan Reddy, Spandana Program, AP CM YS Jagan, Collectors, SPs, Spandana Program News, Spandana Program Latest News And Updates, Spandana Program Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు అంశాలపై సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఉపాధిహామీ పనుల సగటు వేతనం రూ.240 ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే రాష్ట్రంలో పూర్తికాని ఆర్బీకేలు, సచివాలయాలు, హెల్త్‌క్లినిక్స్‌ను అక్టోబరు నెలాఖరుకు పూర్తిచేయాలని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల నిర్వహణపై సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాలని, ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక ఫోన్‌ నంబర్లతో బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. అక్టోబరు 2 నాటికి వేల గ్రామాల్లో జగనన్న భూహక్కు మరియు భూ రక్షసర్వే పూర్తి చేసి, భూ రక్ష హక్కు పత్రాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు.

మరోవైపు గ్రామ, వార్డు సచివాలయాల్లో రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ స్పందన కార్యక్రమం కచ్చితంగా జరగాలని చెప్పారు. ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, సబ్‌ డివిజన్, మండల స్థాయిల్లో కచ్చితంగా స్పందన కార్యక్రమం జరగాలని, ప్రతి బుధవారం స్పందన వినతులపై కలెక్టర్లు సమీక్ష చేయాలని, ప్రతి గురువారం చీఫ్‌సెక్రటరీ జిల్లాకలెక్టర్లతో స్పందనపై సమీక్ష చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక సచివాలయాల్లో ప్రాధాన్యత పనులకు రూ.20 లక్షల చొప్పున కేటాయించామని, ఇందుకోసం . రాష్ట్రవ్యాప్తంగా రూ.3వేల కోట్లు ఖర్చు చేస్తుండగా, దీనికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పనులు పూర్తి చేయాలని సీఎం సూచించారు.

ఇక వృద్ధిరేటులో ఏపీ టాప్‌గా నిలవడం సంతోషకరమని సీఎం వైఎస్ జగన్ అన్నారు. “2021–22లో ఏపీ స్థూల ఉత్పత్తి వృద్ధిరేటు 11.43 శాతంగా నిలవడం సంతోషకరం. దేశ వృద్ధిరేటు కంటే అధికంగా ఉంది. పారదర్శక విధానాలే ఈ వృద్ధికి మూలకారణమని భావిస్తున్నా” అని సీఎం పేర్కొన్నారు. మరోవైపు ఆగస్టు 25న నేతన్న నేస్తం, సెప్టెంబర్ 22న వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదల కార్యక్రమం ఉంటుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − nine =