ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, కరోనా బాధితుల చికిత్స కోసం ఆక్సిజన్ బస్సులు

AP Coronavirus, AP Oxygen Buses, APSRTC, APSRTC Decided to Start Oxygen Buses, APSRTC Decided to Start Oxygen Buses for Covid-19 Treatment, APSRTC decides to set up oxygen beds in AC buses, APSRTC Latest News, APSRTC Latest News Updates, Mango News, Oxygen Buses, Oxygen Buses for Covid-19 Treatment, Oxygen Buses for Covid-19 Treatment In AP, Oxygen Buses In AP

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడి, చికిత్స విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో చికిత్స అందించే విధంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వెన్నెల స్లీపర్‌, ఏసీ బస్సుల్లో ఆక్సిజన్‌ బెడ్లు ఏర్పాటు చేసి, బెడ్స్ కొరత ఉన్న ప్రాంతాల్లో కరోనా బాధితులకు బస్సుల్లోనే వైద్యసేవలు అందించాలని నిర్ణయించారు. వీటిని ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వాడాలని నిర్ణయించినట్టు రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ముందుగా బుట్టాయిగూడెం, కె.ఆర్.పురంలో ఆక్సిజన్ బస్సులు అందుబాటులో ఉంచుతున్నామన్నారు.

ప్రస్తుతం 10 ఆర్టీసీ స్లీపర్ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు జరుగుతుందని, అవసరమైతే మరిన్ని బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాలు, ఆసుపత్రులు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఈ బస్సులు ద్వారా సేవలు అందిస్తామని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాగూర్ తో కలిసి ఈ ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకోసం ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్, ఏసీలు అందించి గ్రీన్ కో సంస్థ సహకారం అందించిందని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఈ సందర్భంగా విజయవాడలో ప్రయోగాత్మకంగా 10 ఆక్సిజన్ బెడ్లుతో రూపొందించిన వెన్నెల బస్సును మంత్రి పేర్ని నాని, ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ పరిశీలించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 8 =