కాంగ్రెస్ ప్రభుత్వ తిరోగమన నిర్ణయం ఇది.. ఫార్ములా రేస్ రద్దుపై కేటీఆర్ రియాక్షన్

This is the Congress governments retrogressive decision KTRs reaction on the cancellation of Formula Race,This is the Congress governments retrogressive decision,KTRs reaction on the cancellation,cancellation of Formula Race,Mango News,Mango News Telugu,formula e Race,KTR Comments On Formula e Race,Formula E Race, F 1 Race, Hyderabad, Congress Government,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates
Formula E Race, F-1 Race, Hyderabad, Congress Government

హైదరాబాద్ వేదికగా గతేడాది ఫిబ్రవరిలో ఫార్ములా ఈ-రేసింగ్ ఛాంపియన్‌షిప్ జరిగిన విషయం తెలిసిందే. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా హుస్సేన్ సాగర్ తీరాని ఈ రేస్ జరిగింది. ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 10న ఫార్ములా ఈ-రేస్ జరగాల్సి ఉంది. అయితే రేసింగ్ ప్రియులకు షాక్ ఇస్తూ ఎఫ్ఐఏ ఫార్ములా సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో ఫిబ్రవరి 10న జరగాల్సిన ఫార్ముల్ ఈ రేస్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం వల్లే రేస్ క్యాన్సిల్ చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. అంతేకాకుండా ఒప్పంద ఉల్లంఘనపై మున్సిపల్ శాఖకు నోటీసు ఇస్తామని ఎఫ్ఐఏ ఫార్ములా ఈ వెల్లడించింది.

పోయినసారి జరిగిన ఫార్ములా రేస్‌ను తిలకించేందుకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు హైదరాబాద్‌కు తరలివచ్చారు. ఈసారి కూడా ఎప్పుడెప్పుడు రేసింగ్ జరుగుతుందా అని రేసింగ్ ప్రియులు ఎదురుచూస్తున్నారు. తాజాగా రేసింగ్ క్యాన్సిల్ అవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటు హైదరాబాద్‌లో రేసింగ్ క్యాన్సిల్ అవ్వడంపై తాము చాలా అసంతృప్తికి గురవుతున్నామని ఫార్ములా ఈ సహవ్యవస్థాపకుడు అల్బర్టో లోంగో వెల్లడించారు. భారత్‌లో ఫార్ములా రేస్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారని అన్నారు.

మరోవైపు ఫార్ముల్ ఈ రేస్ రద్దు కావడంపై మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కూడా స్పందించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తిరోగమన నిర్ణయమన్న కేటీఆర్.. అభివృద్ధికి ఆటంకం కలిగించేలా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఇటువంటి రేస్‌లు నిర్వహించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్ర, దేశ బ్రాండ్  ఇమేజ్ పెరుగుతుందని అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఫార్ములా ఈరేస్‌ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చక్కటి అవకాశంగా ఉపయోగించుకుందని చెప్పుకొచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − eleven =