టీడీపీలోకి శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి.. ముహూర్తం ఫిక్స్

TDP, YCP MPs, Lavu srikrishnadevarayalu, vemireddy prabhakar reddy,CM Jagan,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,assembly elections,andhra pradesh,AP Political updates,Mango News Telugu,Mango News
TDP, YCP MPs, Lavu srikrishnadevarayalu, vemireddy prabhakar reddy

ఏపీలో రాజకీయాలు గరంగరంగా మారుతున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తున్నవేళ ప్రధాన పార్టీలన్నీ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాయి. ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. ఇదే సమయంలో అసంతృప్తులు ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారారు. టికెట్ దక్కకపోవడంతో.. వేరొక చోటు నుంచి పోటీ చేయలేక ఇన్ని రోజులు నమ్ముకొని ఉన్న పార్టీలకు పంగనామాలు పెడుతున్నారు. ఇప్పటికే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికార వైసీపీని వీడారు. తెలుగు దేశం, జనసేన పార్టీల్లోకి జంప్ అయ్యారు. ఇప్పుడు మరో ఇద్దరు వైసీపీ ఎంపీలు కూడా టీడీపీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారు.

శనివారం రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగు దేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. నిజానికి వీరు కొద్దిరోజుల క్రితమే వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత టీడీపీ హైకమాండ్‌తో టచ్‌లోకి వెళ్లారు. అటు నుంచి టికెట్ హామీలు పొందినాకనే.. త్వరలో టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆ పార్టీలోకి చేరేందుకు లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముహూర్తం ఖరారు చేసుకున్నారు.  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో వారు ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు.

ఇటీవల సిట్టింగ్‌ల మార్పులో భాగంగా నెల్లూరు జిల్లాలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున మార్పులు చేర్చులు చేశారు. రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు లోక్ సభ స్థానం ఇంఛార్జ్‌గా ప్రకటించారు. అలాగే ఆ జిల్లాలోని పలు స్థానాలకు కూడా ఇంఛార్జ్‌లను జగన్ మార్చేశారు. అయితే అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జ్‌లను తనకు తెలియకుండానే జగన్ మార్చేశారని.. తన అనుచరులకు టికెట్ ఇవ్వలేదని వేమిరెడ్డి అసంతృప్తికి గురయ్యారు. అందుకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగు దేశం పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. శనివారం చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

మరోవైపు నరసరావుపేట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు కొనసాగుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన్ను గుంటూరు నుంచి పోటీ చేయాల్సిందిగా జగన్ ఆదేశించారు. అదే సమయంలో శ్రీకృష్ణదేవరాయలు స్థానంలో గుంటూరు  నుంచి నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ను బరిలోకి దించుతున్నారు. ఈక్రమంలో గుంటూరు నుంచి పోటీ చేయడం ఇష్టం లేక.. శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ఆయన కూడా టీడీపీ గూటికి వెళ్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − six =