జిల్లాల వారీగా పర్యటనలు చేయనున్న చంద్రబాబు

Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Chandrababu Naidu Latest News, Chandrababu Naidu Latest Political News, Chandrababu Naidu To Visit, Chandrababu Naidu To Visit East Godavari, Chandrababu Naidu To Visit East Godavari District, Chandrababu Naidu To Visit East Godavari District On September 5, Chandrababu Naidu To Visit East Godavari District On September 5 And 6th, Mango News Telugu

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇకనుంచి జిల్లాల వారీగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత డీలా పడిన స్థానిక నాయకులు, కార్యకర్తల్లో ఉత్తేజం నింపి, తెలుగుదేశం పార్టీకి పునరుజ్జీవం తెచ్చేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారు. జిల్లాల వారీగా పర్యటనలు చేపట్టి పార్టీని బలోపేతం చేయడం, టీడీపీకి అండగా ఉన్న వర్గాలకి భరోసా కల్పించే దిశగా సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగే ఈ పర్యటన లో ముందుగా తూర్పుగోదావరి జిల్లాను ఎంచుకున్నారు. సెప్టెంబర్ 5,6 తేదీల్లో కాకినాడలో ఉండి పార్టీ పరిస్థితిని సమీక్షించనున్నారు

కాకినాడలో చంద్రబాబు పర్యటనకు సంబంధించి టీడీపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన అచ్చంపేట దగ్గర టీడీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నారు. అనంతరం కాకినాడ పట్టణంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గాల వారీగా నాయకులతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ ఆరో తేదీన కూడ తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ పరిస్థితులపై ముఖ్యనాయకులతో చర్చిస్తారు. వైసీపీ ప్రభుత్వంపై అంశాలవారీగా పోరాటం చేయడానికి టీడీపీ పార్టీ నిర్ణయించుకుంది, ఆగస్టు 30న ఇసుక కొరతపై రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.

 

[subscribe]
[youtube_video videoid=OTsTqMO6aq8]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =