సీఎం జగన్ కీలక నిర్ణయం, చిన్నపిల్లల కోసం 3 చోట్ల అత్యుత్తమ కేర్‌ సెంటర్లు

3 Child Care Centers In AP, Andhra Pradesh AP CM YS Jagan, Andhra Pradesh Government, AP 3 Child Care Centers, AP CM YS Jagan, Child Care Centers, Child Care Centers In the State with the Best Standards, CM YS Jagan Decides to Set Up 3 Child Care Centers In the State, CM YS Jagan Decides to Set Up 3 Child Care Centers In the State with the Best Standards, Mango News

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు కరోనా నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా మూడో వేవ్‌పై కీలకంగా చర్చించారు. మూడో వేవ్‌పై అనాలసిస్, డేటాలను అధికారులు సీఎంకు వివరించారు. థర్డ్‌ వేవ్‌ వస్తుందా? లేదా? అనే దానిపై శాస్త్రీయ నిర్ధారణ లేదని వెల్లడించారు. అయితే థర్డ్‌వేవ్‌ వస్తే తలెత్తే పరిణామాలు, ప్రభావితమయ్యే వారి వివరాలు, పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు సహా పలు అంశాలపై చర్చించారు. ఈ సమీక్ష సందర్భంగా రాష్ట్రంలోని అన్ని టీచింగ్‌ ఆసుపత్రుల్లో పీడియాట్రిక్‌ వార్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు. పిల్లలకు అత్యుత్తమ వైద్యం అందించడానికి, జాతీయ ప్రమాణాలను అనుసరించి పీడియాట్రిక్‌ వార్డులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పారు. పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులను పరిశీలించి అవకాశం ఉన్నచోట పిల్లలకు చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు.

చిన్నపిల్లల కోసం మూడు కేర్‌ సెంటర్లు:

రాష్ట్రంలో చిన్నారులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడానికి రాష్ట్రంలో మూడు కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. అత్యుత్తమ పీడియాట్రిక్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటుపై దృష్టిపెట్టాలని చెప్పారు. ఒకటి వైజాగ్‌లో, రెండోది కృష్ణా–గుంటూరు ప్రాంతంలో, మూడోది తిరుపతిలో ఏర్పాటు చేయాలని, దాదాపు రూ.180 కోట్ల చొప్పున ఒక్కో ఆసుపత్రి నిర్మాణానికి ప్రణాళిక సిద్ధంచేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 6 =