ఏపీలో కర్ఫ్యూ జూన్ 20 వరకు పొడిగింపు, సడలింపు సమయం మధ్యాహ్నం 2 వరకు పెంపు

Andhra Pradesh government extends curfew, Andhra Pradesh Govt Extends COVID Curfew, Andhra Pradesh govt extends COVID-19 curfew, Andhra Pradesh govt extends curfew, AP extends curfew till June 20, AP govt extends COVID curfew, AP govt extends COVID curfew till June 20, AP Govt Extends Curfew, AP Govt Extends Curfew in the State Till June 20, latest updates, Mango News, Relaxation Time Increased To 2 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 5 నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కర్ఫ్యూ విధింపు గడువు జూన్ 10తో ముగియనున్న నేపథ్యంలో కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కర్ఫ్యూను జూన్ 20 వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ, నియంత్రణ చర్యలపై ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా కర్ఫ్యూ పొడిగింపుపై సీఎం నిర్ణయం తీసుకున్నారు.

కర్ఫ్యూ అమలులో ఇప్పటివరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరవడం సహా, ప్రజలు బయటకు వచ్చేందుకు అనుమతి ఇచ్చారు. అయితే ఆ సడలింపు సమయాన్ని జూన్ 11వ తేదీ నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను కఠినంగా అమలు చేయనున్నారు. కర్ఫ్యూ సమయంలో కేవలం అత్యవసర సేవలనే అనుమతించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 5 =