జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ సన్నిహితుడి ఇంట్లో ఈడీ సోదాలు, బయటపడ్డ రెండు ఏకే 47 తుపాకులు

Jharkhand 2 AK-47 Rifles Seized From The Residence of CM Hemant Soren’s Aides During ED Raids, 2 AK-47 Rifles Seized From The Residence of CM Hemant Soren’s Aides, Two AK-47 Rifles Seized During Ranchi Raids, ED Ranchi Raids, Two AK-47 Rifles Seized, ED recovers Two AK-47 Rifles in raids on Jharkhand CM Hemant Soren's close aide, Jharkhand illegal mining case, Jharkhand CM Hemant Soren, Enforcement Directorate, Jharkhand illegal mining case News, Jharkhand illegal mining case Latest News And Updates, Jharkhand illegal mining case Live Updates, Mango News, Mango News Telugu,

జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) రాంఛీలో బుధవారం విస్తృత సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో ప్రేమ్ ప్రకాశ్ అనే వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఈడీ అధికారులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎందుకంటే అక్కడ వారికి కనిపించింది ఏ డబ్బు మూటలో, కీలక దస్త్రాలో కాదు. లాకర్లలో రెండు ఏకే-47 రైఫిల్స్‌ కనిపించాయి. దీంతో వాక్కయిన అధికారులు వెంటనే తేరుకుని ఆ రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ప్రేమ్ ప్రకాశ్ జార్ఖండ్ ముఖ్యమంత్రి మంత్‌ సోరెన్‌కు సన్నిహితుడు కావడమే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. అయితే ఈ ఆయుధాలను ఆయన అక్రమంగా కలిగి ఉన్నారా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. ప్రస్తుతానికి వీటిని సీజ్ చేసి విచారణ జరుపుతున్నట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. కాగా రూ.100 కోట్ల భారీ మైనింగ్ కుంభకోణానికి సంబంధించిన కేసులో ఈడీ అధికారులు బుధవారం జార్ఖండ్, బిహార్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న సీఎం సన్నిహితుడు పంకజ్ మిశ్రా, బచ్చు యాదవ్‌లు ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు ఈ సోదాలు చేపట్టారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 4 =