అసెంబ్లీ వద్ద కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన స్పీకర్ పోచారం, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

Speaker Pocharam Srinivas Reddy Inaugurates Kanti Velugu Special Medical Camp at Assembly for MLAs, MLCs, Staff

తెలంగాణ రాష్ట్ర శాసనసభ భవనంలోని లాంజ్ లో ఏర్పాటు చేసిన ‘కంటి వెలుగు’ ప్రత్యేక శిబిరాన్ని బుధవారం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, వైద్య,ఆరోగ్య మరియు ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, లెజిస్లేటివ్ సెక్రటరీ డా.వి.నరసింహా చార్యులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, అసెంబ్లీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కంటి వెలుగు పథకం దేశంలోనే గొప్ప కార్యక్రమం అని అన్నారు. కంటి వెలుగు పథకం పేదలకు ఎంతో ఉపయోగకరమని, ఇతర రాష్ట్రాల వాళ్ళు దీన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారని చెప్పారు.

మెరుగైన, ఆధునిక వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేక కళ్ళు పోగుట్టుకున్న పేదలు లక్షల్లో ఉన్నారని, ఈ పథకంతో తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ కంటి వైద్య పరీక్షలు జరుగుతాయని చెప్పారు. శాసనసభ, శాసనమండలి సభ్యులు అందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుని కంటి పరీక్షలు చేయించుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. అసెంబ్లీలో ఆవరణంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు టెస్టింగ్ సెంటర్ ను ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది వినియోగించుకోవాలని కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 7 =