సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ (ఎస్సీ) నియోజకవర్గం పొలిటికల్ హిస్టరీ..

It is the only SC constituency in Greater Hyderabad,It is the only SC constituency,SC constituency in Greater Hyderabad,SC constituency,Mango News,Mango News Telugu,Secunderabad Cantonment SC,Political History ,SC constituency in Hyderabad,In 2018, Sayanna won, From here BRS with a huge majority, Sayannas death,Sayannas daughters Lasya Nandita, BRS,Sayannas daughter Latest News,Sayannas daughter Latest Updates,SC constituency Latest News,SC constituency Latest Updates
Secunderabad Cantonment (SC),Political History ,SC constituency in Hyderabad,In 2018, Sayanna won, from here BRS with a huge majority, Sayanna's death,Sayanna's daughters Lasya Nandita, BRS

దేశంలోనే సైనికుల ఆధీనంలో ఉన్న అతిపెద్దదయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో.. రెండున్నర లక్షల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. అంతేకాదు గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉన్న ఒకే ఒక్క ఎస్సీ నియోజకవర్గం కంటోన్మెంట్‌ ఇదే.  2018లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్  తరపున సాయన్న భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయతే  సాయన్న మరణంతో ఈ  నియోజకవర్గంలో బీఆర్ఎస్ పెద్దదిక్కును కోల్పోయినట్లు అయింది. ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతుర్లు లాస్య నందిత బీఆర్ఎస్ తరపున బరిలో దిగుతున్నారు.

 

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ రిజర్వుడ్‌ నియోజకవర్గం నుంచి జి.సాయన్న ఐదోసార్లు విజయం సాధించారు. ఆయన గతంలో నాలుగుసార్లు టీడీపీ పక్షాన, ఈసారి టీఆర్‌ఎస్‌ తరుపున గెలిచారు. 2014లో ఆయన టీడీపీ అభ్యర్దిగా గెలుపొందినా, తర్వాత జరిగిన పరిణామాలలో టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. తిరిగి  2018లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్దిగా పోటీచేసి తన సమీప కాంగ్రెస్‌ ఐ ప్రత్యర్ది, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణపై 37,568 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. బీజేపీ తరపున పోటీ చేసిన శ్రీ గణేష్‌కు 15,500 ఓట్లు వచ్చాయి. సాయన్నకు 65,752 ఓట్లు రాగా, సర్వే సత్యనారాయణకు 28,184 ఓట్లు వచ్చాయి.

 

అయితే మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో నాలుగుసార్లు గెలుపొందిన సీనియర్‌ కాంగ్రెస్‌ లీడర్ డాక్టర్‌ పి.శంకరరావు 2009లో  సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో పోటీచేసి ఐదోసారి గెలిచినా కూడా.. 2014లో కాంగ్రెస్‌ పార్టీ ఆయనకు టికెట్‌ ఇవ్వలేదు.  కంటోన్మెంట్‌లో రెండుసార్లు గెలిచిన బి.వి గురుమూర్తి, ఒకసారి ఖైరతాబాద్‌లో గెలిచారు. 1967లో ఇక్కడ గెలిచిన వి. రామారావు 1957లో షాబాద్‌లో, 1962లో చేవెళ్లలో గెలిచారు.  అయితే ఆయన చనిపోవడం వల్ల  జరిగిన ఉప ఎన్నికలో  రామారావు భార్య వి.మంకమ్మ ఇక్కడ గెలిచారు. ఆ తర్వాత మరోసారి  కూడా గెలుపొందారు.

 

ఇక్కడ గెలిచిన వారిలో బి.వి గురుమూర్తి, ఎన్‌.ఎ.కృష్ణ. డి.నర్సింగరావు, డాక్టర్‌ శంకరరావు మంత్రి పదవులు నిర్వహించారు. మరో నాయకుడు గురుమూర్తి రాజ్యసభ సభ్యనిగా కూడా వున్నారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌కు  పద్నాలుగు సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ఐ కలిసి ఏడుసార్లు, జనతా పార్టీ ఒకసారి టీడీపీ ఆరుసార్లు గెలిచాయి. శంకరరావు అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో సభ్యుడయ్యారు. కాని ఆ తర్వాత కాలంలో ముఖ్యమంత్రితో విభేదాలలో ఇరుక్కుని ఆయన పదవి కోల్పోయారు. అయితే శంకరరావు రాసిన లేఖ ఆధారంగానే అప్పట్లో.. హైకోర్టు జగన్‌ ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశించింది.

 

ఆ తర్వాత జగన్‌ను సీబీఐ అరెస్టు చేయడంతో అదంతా రాజకీయ వివాదంగా మారిపోయింది. అలా రాష్ట్రంలో కీలకమైన పరిణామానికి కారకుడైన శంకరరావు.. సీఎం కిరణ్‌ కుమార్ రెడ్డిని తీవ్రంగా విమర్శించి మంత్రి పదవిని కూడా కోల్పోయి.. ఆ తర్వాత  కాంగ్రెస్‌ టికెట్‌ను కూడా పొందలేక పోయారు.

 

ఇక సర్వే సత్యనారాయణ ఒకసారి టీడీపీ తరుపున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ ఐ నుంచి సిద్దిపేట, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాలలో సర్వే సత్యనారాయణ విజయం సాధించారు. మల్కాజిగిరి జనరల్‌ స్థానం అయినప్పటికి కూడా కాంగ్రెస్‌ ఐ తరపున సర్వే సత్యనారాయణ  పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత కేంద్రంలో మంత్రి పదవిని కూడా చేశాక..2018లో కంటోన్మెంట్‌ నుంచి పోటీచేసి ఓడిపోయారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 11 =