ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. ఉత్తరాంధ్ర తీర ప్రాంత జిల్లాలపై ప్రభావం చూపే అవకాశం

IMD Predicts Cyclone Looming Over AP Likely To Affect The Coastal Districts of Utharandhra,IMD Predicts Cyclone Looming Over AP,IMD Predicts Cyclone,IMD Predicts Cyclone In AP,Mango News,Mango News Telugu,Cyclone In Andhra Pradesh,Bay Of Bengal Cyclone,IMD Issues Cyclone Warning,IMD Issues Cyclone Warning In Odisha,Cyclone Mocha Form Over Bay Of Bengal,Cyclone Over Bay Of Bengal,IMD Latest News And Updates,Cyclone Mocha Latest News And Updates,Odisha Weather Report

ఆంధ్రప్రదేశ్‌కు తుఫాన్ ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో సోమవారం నాటికి అల్పపీడనం దశనుంచి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇక ఈ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు తుఫాన్ సూచన నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లను ఒడిశా ప్రభుత్వం హెచ్చరించింది. తుఫాన్ సూచన దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని తీర ప్రాంత, పరిసర జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + two =