ఈనెల 14న కరీంనగర్‌లో లక్ష మందితో ‘హిందూ ఏక్తా యాత్ర’.. ప్రకటించిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌

Telangana BJP Chief Bandi Sanjay Announces Will Hold Hindu Ekta Yatra with One Lakh People at Karimnagar on May 14,Telangana BJP Chief Bandi Sanjay,Bandi Sanjay Announces Will Hold Hindu Ekta Yatra,Hindu Ekta Yatra with One Lakh People at Karimnagar,Mango News,Mango News Telugu,Telangana BJP to hold Hindu Ekta Yatra,Telangana BJP Chief Bandi Sanjay Latest News,Telangana BJP Chief Bandi Sanjay Latest Updates,Hindu Ekta Yatra,Hindu Ekta Yatra Latest News And Updates,Hindu Ekta Yatra At Karimnagar

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కీలక ప్రకటన చేశారు. ఈనెల 14న కరీంనగర్‌లో భారీ ఎత్తున ‘హిందూ ఏక్తా యాత్ర’ నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ‘ఏక్తా యాత్ర’ ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో హిందువులకు ప్రాధాన్యత లేదని, దీనికి ఇటీవలే ప్రారంభించిన నూతన సచివాలయంలో నల్ల పోచమ్మ గుడికి కేవలం రెండున్నర గుంటల స్థలం కేటాయించడం నిదర్శనమని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హిందువుల విషయంలో ఎంత అన్యాయంగా వ్యవహరిస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణని, అందుకే హిందువుల సంఘటిత శక్తిని చాటి చెప్పేలా ఏక్తా యాత్ర చేస్తున్నామని వెల్లడించారు.

ఇంకా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. హిందువులను ఏకం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అని, కావున పార్టీలు, వర్గాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ యాత్రకు అన్ని జిల్లాల నుంచి హిందువులు భారీగా తరలిరావాలని, హిందూ ధర్మ రక్షణ కోసం పాటుపడే ప్రతి ఒక్కరూ దీనిలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇక దాదాపు లక్ష మందితో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో పలువురు జాతీయ స్థాయి నాయకులు కూడా పాల్గొంటారని వెల్లడించారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారని, అలాగే కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా ఈ యాత్రకు హాజరయ్యే అవకాశం ఉందని బండి సంజయ్‌ తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − twelve =