జనసేనాని పోటీ అక్కడినుంచేనా..?

Jana Sena competition from there,Jana Sena competition,competition from there,Pawan kalyan, janasena chief pawan kalyan, AP Assembly elections, AP Politics,Mango News,Mango News Telugu,Jana Sena Party,Jana Sena Founder Pawan Kalyan,Janasena Chief Pawan Kalyan,Jana Sena competition Latest News,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,Janasena Latest News,Janasena Latest Updates
Pawan kalyan, janasena chief pawan kalyan, AP Assembly elections, AP Politics

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో.. అందరి దృష్టి ఏపీపైకి వెళ్లింది. మరో నాలుగైదు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈక్రమంలో ఇప్పటి నుంచే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ దూకుడు పెంచేశాయి. ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అస్త్రాలను రెడీ చేసుకుంటున్నాయి. ఈసారి తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయి. ఈక్రమంలో చంద్రబాబు నాయుడు.. జనసేనకు ఎన్ని సీట్లు కట్టబెడుతారనే అంశం ఆసక్తికరంగా మారింది.

పొత్తు పెట్టుకున్నప్పుడు సీట్ల సర్దుబాటు వద్దే ఇరు పార్టీల మధ్య ప్రధానంగా సమస్యలు తలెత్తుతుంటాయి. ఇక్కడే విబేధాలు వస్తుంటాయి. పొత్తు పెట్టుకొని సీట్లు సర్దుబాటుకాక విడిపోయిన పార్టీలు ఎన్నో ఉన్నాయి. అయితే టీడీపీ, జనసేన మాత్రం సీట్ల సర్దుబాటు విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జనసేన పోటీ చేయబోయే స్థానాలు కూడా ఖరారు అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు 21 స్థానాలను జనసేనకు కేటాయించారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఓ లీస్ట్ కూడా వైరలవుతోంది.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఈసారి ఒక్క స్థానం నుంచే పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. గాజువాక నుంచి కాకుండా ఈసారి భీమవరం నుంచి పవన్ బరిలోకి దిగనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇకపోతే జనసేనకు అత్యంత కీలకమైన స్థానం రాజోల్. ఇక్కడి నుంచి డీఎంఆర్ శేఖర్‌ను జనసేనాని బరిలోకి దింపుతున్నారట. ఇక జనసేన రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదేండ్ల మనోహర్.. తాను ముందు నుంచి చెబుతున్నట్లుగానే తెనాలి నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే జనసేన నేతలు తాడేపల్లి నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, విజయవాడ వెస్ట్ నుంచి పోతిన మహేష్, గిద్దలూరు నుంచి ఆమంచి శ్రీనివాస రావు, నీలిమర్ల నుంచి లోకం నాగ మాధవి గజపతినగరం నుంచి పడాల అరుణ బరిలోకి దిగనున్నట్లు ఓ జాబితా వైరలవుతోంది. వీరితో పాటు పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు, గాజువాక నుంచి సుందరపు సతీష్, భీమిలి నుంచి పంచకర్ల సందీప్, ముమ్మిడివరం నుంచి పితాని బాలకృష్ణ జనసేన తరుపున పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

అలాగే యలమంచిలి నుంచి సుందరపు విజయ్‌కుమార్, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, టనుకు నుంచి రామచంద్రరావు, కాకినాడ రూరల్ నుంచి పితాని నానాజీ, రాజానగరం నుంచి బత్తుల బాలరామకృష్ణ, రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్, పిఠాపుర నుంచి ఉదయ్ శ్రీనివాస్,  రామచంద్రాపురం నుంచి చిక్కం దొరబాబు, జగ్గంపేట నుంచి పటంశెట్టి సూర్యచంద్ర రావు బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ జాబితా వాస్తవానికి దగ్గరగా ఉండడంతో.. దాదాపు ఇదే ఫైనల్ అయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =