ఢిల్లీ పర్యటన ముగించుకున్న ఏపీ సీఎం జగన్

AP CM YS Jagan Abruptly Cancels Delhi Tour, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Mango News Telugu, YS Jagan Attend Personal Assistant Narayana Funeral, YS Jagan Political Updates

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి డిసెంబర్ 5, గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యి రాష్ట్రాభివృద్ధి అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించాలని భావించారు. అయితే సీఎం వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో గురువారం రాత్రి మరణించారు. దీంతో సీఎం వైఎస్‌ జగన్‌ తన ఢిల్లీ పర్యటనను అర్థాంతరంగా ముగించుకున్నారు. ఈ రోజు ఢిల్లీ నుంచి బయలుదేరి నేరుగా కడప విమానాశ్రయానికి సీఎం చేరుకోనున్నారు. అనంతరం అక్కడ నుంచి అనంతపురం జిల్లాలోని నారాయణ స్వగ్రామామైన దిగువపల్లెకు వెళ్లనున్నారు. అక్కడ నారాయణ భౌతిక కాయానికి నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులను సీఎం పరామర్శిస్తారు. తిరిగి ఈ రోజు సాయంత్రం తాడేపల్లికి చేరుకోనున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో నారాయణకు ముప్పై సంవత్సరాలకు పైగా అనుబంధం ఉంది.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − eight =