టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఖరారు?.. త్వరలో అధికారిక ప్రకటన

Janasena, BJP, TDP, Chandrababu , pawan, modi,Delhi, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,NDA, Mango News Telugu,Mango News
Janasena, BJP, TDP, Chandrababu , pawan, modi

తెలుగు దేశం-జనసేన-బీజేపీ పొత్తు ఖాయమయిందా?.. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల ప్రయత్నాలు ఫలించాయా?.. త్వరలోనే పొత్తులపై అధికారిక ప్రకటన వెలువడనుందా?.. అంటే ప్రస్తుత పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు. పొత్తులపై సుధీర్ఘ చర్చలు జరిపారు. అంతకంటే ముందే జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. ఈక్రమంలో పొత్తులపై ఏకీభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ కూడా కూటమితో జత కట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

త్వరలోనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు మరోసారి హస్తినాకు వెళ్లనున్నారు. ఈనెల 20 లేదా 21న ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత బీజేపీతో పొత్తుపై అధికారిక ప్రకటన చేయనున్నారట. అయితే సీట్ల సర్దుబాటు వద్దకు వచ్చేసరికి బీజేపీ అసెంబ్లీ స్థానాలకంటే.. లోక్ సభ స్థానాలు ఎక్కువ ఇవ్వాలని పట్టుబడుతోందట. కేంద్రంలో మూడోసారి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈక్రమంలో ఏపీలో ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా.. కేంద్రంలో తమ ప్రభుత్వం కొలువుదీరడానికి సహాయకరంగా ఉంటుందని బీజేపీ భావిస్తోందట.

అందుకే ఏపీలో మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉండగా.. అందులో 10 స్థానాలు ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతోందట. అందులో రెండు స్థానాల్లో జనసేన, మిగిలిన ఎనిమిది స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగనుందట. అలాగే 45 అసెంబ్లీ స్థానాలను బీజేపీ కోరుతోందట. అందులో 32 నుంచి 35 స్థానాలు జనసేనకు ఇచ్చి మిగిలిన స్థానాల్లో తాము బరిలోకి దిగాలని బీజేపీ భావిస్తోందట. 45 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలు తీసుకోవడం ద్వారా ఓట్ల బదిలీ సాఫీగా జరుగుతుందని బీజేపీ పెద్దలు అనుకుంటున్నారట.

చంద్రబాబు నాయుడు మొదట 45 స్థానాలు ఇచ్చేందుకు అంగీకరించకపోయినప్పటికీ..  చివరికి రాజీపడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. దీంతో అనుకున్నన్ని సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు ఒకే చెప్పడంతో అటు బీజేపీ కూడా కూటమితో జత కట్టేందుకు సిద్ధమయిందట. ఈ మేరకు త్వరలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఢిల్లీకి వెళ్లి పొత్తుపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − five =