రేపటికి అదనంగా రాష్ట్రానికి 230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుంది : మంత్రి ఆళ్ల నాని

AP Health Minister Alla Nani Held Review over Corona Situation and Vaccination Program,Mango News,Mango News Telugu,AP,AP News,AP Health Minister Alla Nani Review over Corona Situation,COVID-19 Vaccine,AP Govt,AP Health Minister Alla Nani,Minister Alla Nani,Alla Nani latest news,Alla Nani live,Alla Nani speech,Alla Nani press meet,Alla Nani,ycp latest news,ap latest news,ap political news,coronavirus,COVID-19 Second Wave,covid-19,Health Minister Alla Nani About Covid Situation in AP,Corona Cases In AP,Covid Patients In AP,Covid-19 In India,Covid In AP,Covid Situation,AP Covid Situation,New Corona Cases In AP,Alla Nani About Covid Situation In AP

కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్ పక్రియ వేగవంతం చేసేందుకు తీసుకోవలసిన చర్యలపై విశాఖపట్నం విమ్స్ లో ఏపీ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష సమావేశం నిర్వహించారు. విశాఖపట్నం జిల్లాలో కోవిడ్ ఆసుపత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది కొరత లేకుండా వెంటనే రిక్రూట్మెంట్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లాలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కోవిడ్ హాస్పిటల్స్ లో బెడ్స్, ఆక్సిజన్ కొరత లేకుండా ముందోస్తుగా ప్రణాళిక సిద్ధం చేయాలని, కోవిడ్ బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎక్కడైనా నిర్లక్ష్యం కనిపిస్తే ఎవరిని ఉపేక్షించే పరిస్థితి ఉండదని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

రేపటికి అదనంగా రాష్ట్రానికి 230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుంది:

“సీఎం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడంతో ఏపికి ఆక్సిజన్ సరఫరా వేగవంతం చేసాం. కోవిడ్ ఉధృతి పెరగడంతో ఆక్సిజన్ డిమాండ్ కు తగిన విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఆక్సిజన్ సరఫరాపై సీఎం వైఎస్ జగన్ కేంద్రానికి లేఖ రాయడంతో కేంద్రం నుండి సానుకూలంగా నిర్ణయం వచ్చింది. రేపటికి అదనంగా రాష్ట్రానికి 230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని దుర్గాపూర్ నుంచి 2 ట్యాంకుల్లో 40మెట్రిక్ టన్నులు ఆక్సిజన్ వస్తుంది. జామ్ నగర్ నుండి మరో 110మెట్రిక్ టన్నులు ఆక్సిజన్ రైలు మార్గంలో ఏపికి వస్తుంది. జమ్ షెడ్ పూర్ నుండి మరో 80మెట్రిక్ టన్నులు, ఆక్సిజన్ వస్తుంది. రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కోవిడ్ హాస్పిటల్స్ నుండి పెషేంట్స్ డీఛార్జ్ లు పెరుగుతున్నాయి” అని మంత్రి పేర్కొన్నారు.

ఇంటింటా ఫీవర్ సర్వే:

“కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుండి ఇంటింటికి వైద్య సిబ్బంది వెళ్లి జ్వరాలపై సర్వే చేపడుతున్నారు. జ్వరం ఉన్న వాళ్ళను గుర్తించి వెంటనే వారికీ వైద్య సదుపాయం, మెడికల్ కిట్స్ అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం. కోవిడ్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన 104కు వేల సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. జిల్లాలో ప్రతి కోవిడ్ హాస్పిటల్ లో ఆక్సిజన్ వృధా కాకుండా నోడల్ ఆఫీసర్స్ పర్యవేక్షణ ఉండాలి. వ్యాక్సిన్ కేంద్రాలు వద్ద రద్దీ లేకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలకు అవగాహన కల్పించడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం” అని వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + fifteen =