ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ మరణం పట్ల సంతాపం తెలిపిన ప్రధాని మోదీ

PM Narendra Modi Condoles Death of Popular Bollywood Actor-Director Satish Kaushik,PM Narendra Modi Condoles Bollywood Actor,Actor-Director Satish Kaushik,Condolences of Bollywood Actor Satish Kaushik,Mango News,Mango News Telugu,Indian Prime Minister Narendra Modi Condolences,Actor Satish Kaushik,Satish Kaushik Passes Away,Actor Satish Passes Away At 66,Satish Kaushik dies of a heart attack,Actor-Director Satish Kaushik Dies,Actor Satish Kaushik Latest News,Actor Satish Kaushik Updates,Actor Satish Kaushik Live Updates,Actor Satish Kaushik Live,Director Satish Kaushik News

ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “ప్రముఖ సినీనటుడు సతీష్ కౌశిక్ జీ యొక్క అకాల మరణంతో బాధపడుతున్నాను. హృదయాలను గెలుచుకున్న అతను ఒక సృజనాత్మక మేధావి, అతని అద్భుతమైన నటన మరియు డైరెక్షన్ కు ధన్యవాదాలు. అతని చేసిన పాత్రలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. అతని కుటుంబానికి మరియు అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేస్తూ, నటుడు, దర్శకుడు మరియు రచయిత సతీష్ కౌశిక్ జీ ఆకస్మిక మరణం తీవ్రంగా బాధించిందన్నారు. భారతీయ సినిమా, కళాత్మక సృష్టి మరియు ప్రదర్శనలకు ఆయన చేసిన సేవలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోబడతాయని చెప్పారు. సతీష్ కౌశిక్ కుటుంబానికి మరియు అభిమానులకు అమిత్ షా తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

నటుడు సతీష్ కౌశిక్ (66) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఢిల్లీలో ఉన్న ఆయనకు బుధవారం అర్ధరాత్రి ఒంట్లో నలతగా ఉండడంతో ఆసుపత్రికి కారులో వెళుతున్న సమయంలో గుండె పోటుకు గురవడంతో తుదిశ్వాస విడిచారు. సతీష్ కౌశిక్​ మరణించిన విషయాన్ని అతని సన్నిహితుడు, ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ తన ట్విట్టర్​ ఖాతా ద్వారా వెల్లడించారు. సతీష్ కౌశిక్ 1983లో నటన జీవితం ప్రారంభించి వందకు పైగా చిత్రాలలో నటించారు. నటుడిగా, హాస్యనటుడిగా, దర్శకుడిగా ప్రేక్షకుల హృదయాల్లో సతీష్ కౌశిక్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. సతీష్ కౌశిక్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు, నటీనటులు తమ సంతాపాన్ని తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 7 =