చిత్తూరు జిల్లాలో అక్కడ ఏ పార్టీ గెలుస్తుంది?

Satyavedu Constituency Poltical History,Chittor,Satyavedu,Satyavedu voters Which party will win, Chittoor district?,legislative assembly constituency, SC voters,TDP,congress,Andhra Pradesh News Updates, AP Political News, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
Satyavedu Constituency Poltical History,Chittor,Satyavedu,Satyavedu voters Which party will win, Chittoor district?

చిత్తూరు జిల్లా అంటేనే అందరికీ తిరుమల వెంకటేశుడు, కాణిపాకం వినాయకుడుతో పాటు శ్రీకాళహస్తి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు గుర్తుకువస్తాయి. నిత్యం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లే ఈ జిల్లాలో.. భక్తే కాదు..  రాజకీయాలు కూడా  ఆసక్తిగానే ఉంటాయి.  జగన్ సర్కార్ హయాంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో 2022 వ సంవత్సరం ఏప్రిల్ 4న  ఈ జిల్లాలోని భాగాలను కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లాలో కలిపారు. మొత్తంగా చిత్తూరు జిల్లాలో  31 మండలాలు, 4 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.చిత్తూరు జిల్లాకు తూర్పు, దక్షిణంలో తమిళనాడు, పశ్చిమాన కర్ణాటక సరిహద్దులుగా ఉన్నాయి.

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ నియోజకవర్గంగా సత్యవేడుకు గుర్తింపు ఉంది. ఇక్కడ 1962 నుంచి  ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో 6 సార్లు టీడీపీ  విజయం సాధిస్తే.. ఐదుసార్లు కాంగ్రెస్ పార్టీ , ఒకసారి స్వతంత్ర పార్టీ విజయం సాధించింది. త్వరలో జరగనున్న ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుందో.. సత్యవేడు ఓటర్లు ఏ పార్టీని గెలిపిస్తారో అన్న చర్చ పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా నడుస్తోంది.  2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కె.ఆదిమూలం మెజార్టీ విజయం సాధించి రికార్డు సృష్టించారు.

1962లో తొలిసారి చిత్తూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన  టి.బాలకృష్ణయ్య.. స్వతంత్ర అభ్యర్థి కటారి మునిస్వామిపై  విజయం సాధించారు. 1967లో జరిగిన ఎన్నికల్లో మాత్రం  అనూహ్యంగా స్వతంత్ర అభ్యర్థి కటారి మునిస్వామి.. కాంగ్రెస్  నుంచి పోటీకి దిగిన  టి.బాలకృష్ణయ్యపై విజయాన్ని సాధించారు.  1972లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి సి.దాస్..డీఎంకే  పార్టీ అభ్యర్థి శిఖామణిని ఓడించారు. ఆ తర్వాత, 1978లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి సి.దాస్.. జనతా పార్టీ అభ్యర్థి వై.గంగాధరాన్ని ఓడించారు. అయితే, 1983లో టీడీపీ అభ్యర్థిగా నిలబడ్డ తలారి మనోహర్.. కాంగ్రెస్ అభ్యర్థి సి.దాస్ విజయానికి బ్రేక్ వేసి మనోహర్ గెలిచారు.

ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికలో టీడీపీ అభ్యర్థి ఎమ్.సురాజన్.. కాంగ్రెస్ అభ్యర్థి వై.రామారావును ఓడించారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థి సి.దాస్.. టీడీపీ అభ్యర్థి తలారి మనోహర్‌ను ఓడించారు. 1994లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎమ్.సురాజన్.. కాంగ్రెస్ అభ్యర్థి కె.నారాయణ స్వామిపై విజయాన్ని  సాధించారు.  1999లో కూడా టీడీపీ నుంచి నిలబడ్డ ఎన్.శివప్రసాద్.. కాంగ్రెస్ అభ్యర్థి కె.నారాయణ స్వామిని ఓడించారు.

2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కె.నారాయణ స్వామి.. టీడీపీ అభ్యర్థి ఎన్.శివప్రసాద్ ను ఓడించారు.  2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి హెచ్.హేమలత.. కాంగ్రెస్ అభ్యర్థి కె.నారాయణ స్వామిని ఓడించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థి తలారి ఆదిత్య.. వైసీపీ అభ్యర్థి కె.ఆదిమూలంను ఓడించారు. అయితే, 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కె.ఆదిమూలం.. టీడీపీ అభ్యర్థి జె.డి.రాజశేఖర్‌ను భారీ మెజార్టీ తేడాతో ఓడించి  రికార్డు సృష్టించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 7 =