వైఎస్ఆర్ చేయూత పథకం: 2.72 లక్షల మహిళలకు రూ.510 కోట్లు అందజేత

YSR Cheyutha Second Phase Started Today, Another 2.72 Lakh Women will Get the Benefit

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్‌ రెడ్డి గత ఆగస్టు 12 న “వైఎస్‌ఆర్‌ చేయూత” పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45–60 ఏళ్లలోపు అర్హత గల మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగు సంవత్సరాల్లో మొత్తంగా రూ.75 వేలు అందజేయనున్నారు. అందులో భాగంగా మొదటి విడత సాయంగా 21 లక్షల మంది మహిళ లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా రూ.18,750 జమ చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ చేయూత రెండో విడత సాయం కార్యక్రమాన్ని గురువారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పంచాయతీరాజ్‌ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది, తదితరులు పాల్గొన్నారు.

రెండో విడతలో భాగంగా మరో 2.72 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.18,750 చొప్పున మొత్తం రూ.510.01 కోట్లు అందజేస్తున్నట్టు గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా స్వయం సాధికారితపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి, ప్రముఖ కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకొని మహిళలుకు చేయూత అందించడంలో భాగంగా ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌ చేయూత పథకం కోసం బడ్జెట్‌లో రూ.4,700 కోట్లు కేటాయించారు, నాలుగేళ్లలో మొత్తం రూ.17 వేల కోట్లను లబ్ధిదారులకు ప్రభుత్వం అందించనుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =