విశ్వం గుట్టు వీడేనా?

Nasas Osiris Rex Capsule Reaches Earth,Nasas Osiris Rex Capsule,Nasa Capsule Reaches Earth,Rex Capsule Reaches Earth,Mango News,Mango News Telugu,Nasa Osiris Rex ,Osiris-Rex , Nasas Osiris Rex Capsule, Osiris Rex Reaches Earth,Nasas First Asteroid Sample Has Landed,Nasa,Nasas Osiris Rex Capsule Latest News,Nasas Osiris Rex Capsule Latest Updates,Nasa Latest News And Updates,Nasas Osiris-Rex Mission Latest News

విశ్వం ఆవిర్భావం, భూమి పుట్టుకను తెలుసుకునేందుకు నాసా ఒసిరిస్‌ రెక్స్‌ మిషన్‌ చేపట్టింది. దీనిలో భాగంగా ఆస్టరాయిడ్‌ బెన్నూ అనే గ్రహశకలంపై దృష్టి సారించిన నాసా..దాని నమూనాలను సేకరించి, పరిశోధనలు చేపట్టేందుకు సిద్ధం అవుతోంది.దీనిలో భాగంగా రెండేళ్ల క్రితం ఆస్టరాయిడ్‌ బెన్నూపై డ్రిల్లింగ్‌ చేసి నమూనాలు సేకరించిన ఒసిరిస్- రెక్స్ స్పేస్ క్రాఫ్ట్‌.. 2021 మే 10న భూమికి తిరుగు ప్రయాణమవగా.. సెప్టెంబర్ 25న మిషన్‌లోని క్యాప్సూల్‌.. అమెరికాలో విజయవంతంగా ల్యాండ్‌ అయ్యిందన్న విషయాన్ని నాసా ధ్రువీకరించింది.

మిషన్‌ ఆస్టరాయిడ్‌ బెన్నూ గ్రహశకలం నమూనాల వల్ల.. భూమి పుట్టుక గురించి తెలుసుకునే అవకాశం ఉందని నాసా చెబుతోంది. నిజానికి 1999 సెప్టెంబర్‌ 11న నాసా భారీ ఆస్టరాయిడ్‌ను తొలిసారి గుర్తించింది. దానికే బెన్నూగా నామకరణం కూడా చేసింది. ఇది కార్బోనేషియస్ గ్రహశకలంగా నాసా గుర్తించింది. ఈ గ్రహశకలం విస్తీర్ణం సుమారు 565 మీటర్లు ఉంటుంది. సెకనుకు 28 కి.మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న దాని వేగాన్ని దృష్టిలో పెట్టుకొనే.. ఈజిప్ట్ మైథాలజీలో ఉన్న బెన్ను అనే పక్షి పేరును..నాసా ఈ ఆస్టరాయిడ్‌కు ఆ పేరు పెట్టింది.

4.5 బిలియన్ సంవత్సరాల పురాతన గ్రహశకలంగా బిన్నూ గురించి భావిస్తున్న నాసా.. భవిష్యత్‌లో బిన్నూ ఆస్టరాయిడ్‌ భూమిని ఢీకొట్టే అవకాశముందని అంచనా వేస్తుంది. దాదాపుగా 2,182 సంవత్సరం సెప్టెంబర్‌లో బెన్ను ఆస్టరాయిడ్ భూమిని ఢీ కొట్టే ఛాన్స్‌ ఉందని నాసా అంచనా వేస్తోంది. దీంతోనే ఈ గ్రహశకలంపై దృష్టి సారించిన నాసా.. సమగ్ర అధ్యయనం చేపట్టడానికి నిర్ణయం తీసుకుంది. అందులో ఉండే ఖనిజాలతో పాటు, ద్రవ్యరాశి, కక్ష్య, విస్తీర్ణం గురించి తెలుసుకోవడం కోసం 2018 డిసెంబర్ 3న ఒసిరిస్- రెక్స్ అనే స్పేస్‌క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి పంపింది.

అయితే సుదీర్ఘంగా ప్రయాణించిన ఒసిరిస్- రెక్స్ స్పేస్‌క్రాఫ్ట్‌ 2020 అక్టోబర్‌లో బెన్నూ వద్దకు చేరింది. ఆ తర్వాత ఆ గ్రహశకలం ఉపరితలంపై డ్రిల్‌ చేస్తూ మట్టి, రాళ్లు వంటి నమూనాలను సేకరించింది. మరలా 2021 మే 10న స్పేస్‌క్రాఫ్ట్‌ భూమి వైపు తిరుగు ప్రయాణమై.. ఈ ఆదివారం అంటే సెప్టెంబర్ 25న అమెరికాలోని ఉటాలో భూమిని తాకినట్లు నాసా తెలిపింది. అంతేకాదు ఒసిరిస్- రెక్స్ స్పేస్ క్రాఫ్ట్ ల్యాండింగ్ దృశ్యాలను రికార్డు చేసిన నాసా..దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది.దీంతో గ్రహశకలపు నమూనాలను సేకరించిన నాసా.. భూమి పైకి తీసుకువచ్చి రికార్డు సృష్టించింది

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =