మోహిదీపట్నంలో స్టీల్ స్కైవాక్ నిర్మాణానికి ఆమోదం, త్వరలోనే టెండర్లకు ఆహ్వానం
హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే రోడ్లలో ఒకటైన మెహిదీపట్నం వద్ద పాదచారుల కోసం స్కైవాక్ ను నిర్మించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెహదీపట్నంలో స్కైవాక్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్...
ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, రెండో శనివారాల్లో కూడా తరగతులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండరును ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది. అలాగే రాష్ట్రంలో అన్ని జూనియర్ కాలేజీలు...
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ మార్లన్ శామ్యూల్స్
వెస్టిండీస్ సీనియర్ బ్యాట్స్‌మెన్ మార్లన్ శామ్యూల్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లుగా బుధవారం నాడు శామ్యూల్స్ ప్రకటన చేశాడు. 2000వ సంవత్సరంలో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్...
ఏలూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు ఏలూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఏలూరులో రూ.330 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు....
చిత్ర పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూత
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూశారు. ఆయన వయసు 55 సంవత్సరాలు. గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని...
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి అరెస్ట్
ప్రముఖ జర్నలిస్టు, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిని ఈ రోజు ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. 2018 లో అలీబాగ్‌లో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ మరియు అతని తల్లి కుముద్...
హైదరాబాద్ ను ఆసియాలోనే అగ్రగామి లైఫ్ సైన్సెస్ గమ్యస్థానంగా నిలుపుతాం: మంత్రి కేటిఆర్
వచ్చే పది సంవత్సరాల్లో హైదరాబాద్ ను ఆసియాలోనే అగ్రగామి లైఫ్ సైన్సెస్ గమ్యస్థానంగా నిలిపేందుకు ప్రయత్నం చేస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు. రానున్న పది సంవత్సరాల్లో పెద్ద ఎత్తున...
తెలంగాణలో కొత్తగా 1637 కరోనా కేసులు, 6 మరణాలు నమోదు
తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1637 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 3, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,44,143 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు: ట్రంప్, జో బైడెన్ మధ్య హోరాహోరీ పోరు
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ పూర్తయిన అనంతరం ఓట్ల లెక్కింపు పక్రియ కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్...
ఏపీలో కరోనా: మరో 2849 పాజిటివ్ కేసులు, 15 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 3, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,30,731 కు చేరుకుంది. గత 24 గంటల్లో 84534 శాంపిల్స్ కి పరీక్షలు...
ప్రారంభమైన అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్
అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మొదలైంది. న్యూ హాంప్‌షైర్ రాష్ట్రంలో అమెరికా కాలమానం ప్రకారం అర్ధరాత్రి నుంచే పోలింగ్ ప్రారంభమైంది. ఇక మిగతా రాష్ట్రాల్లో నవంబర్ 3, మంగళవారం ఉదయం 6...
దేశంలో కరోనా నుంచి 76 లక్షలమందికి పైగా రికవరీ, రికవరీ రేటు 91.96 శాతం
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. నవంబర్ 3, మంగళవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 82,67,623 కు, మరణాల సంఖ్య 1,23,097 కు చేరుకుంది. గత...
తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు హాజరుకాని విద్యార్థులకు శుభవార్త
కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసి, విద్యార్థులను ఉత్తీర్ణులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇంటర్ పరీక్షలకు హాజరు కాని విద్యార్థులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ...
అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై సీఎం జగన్ సమీక్ష, 14 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. విజయవాడ నగరంలోని బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్‌లో 125 అడుగుల అంబేద్కర్...
వరద ప్రభావం: అర్హులైన లబ్దిదారులను గుర్తించండి -హోమ్ మంత్రి
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వారిని గుర్తించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెఛ్ఎంసీ) పాతబస్తీకి చెందిన అధికారులను రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ మంగళవారం నాడు...
ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల మధ్య మొదలైన బస్సు సర్వీసులు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపే అంశంపై ఏర్పడ్డ సందిగ్ధత ఎట్టకేలకు తొలిగిపోయింది. రెండు రాష్ట్రాల మధ్య ఏడు నెలల అనంతరం గత అర్ధరాత్రి నుండి ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి....
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న యూఏఈ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషిద్
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషిద్ అల్ మాక్తొమ్ కూడా మంగళవారం నాడు...
నవంబర్ 6 న జగనన్న తోడు, చిరు వ్యాపారులకు పదివేలు వడ్డీలేని రుణం
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు రూపకల్పన చేసిన 'జగనన్న తోడు' పథకాన్ని నవంబర్ 6, శుక్రవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. జగనన్న తోడు...
ఓటర్ల తుది జాబితా ప్రచురించాకా ఎప్పుడైనా జీహెఛ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ
ఎన్నికల ప్రక్రియలో రిటర్నింగ్ అధికారి పాత్ర అత్యంత ప్రాధాన్యమైనదని, రిటర్నింగ్ అధికారిగా నియమించబడిన వారు పారదర్శకంగా, తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాలని, అలాగే ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని...
దుబ్బాక ఉపఎన్నిక: ముగిసిన పోలింగ్, విజయావకాశాలపై విశ్లేషణ
దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గంలో ఈ రోజు జరిగిన ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 81.44 % పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం...




















































