ప్రారంభమైన అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్

US Elections 2020 Updates: Voting begins in New Hampshire State

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మొదలైంది. న్యూ హాంప్‌షైర్‌ రాష్ట్రంలో అమెరికా కాలమానం ప్రకారం అర్ధరాత్రి నుంచే పోలింగ్‌ ప్రారంభమైంది. ఇక మిగతా రాష్ట్రాల్లో నవంబర్ 3, మంగళవారం ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ మొదలైంది. ఈసారి అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ తరపున ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా జో బైడెన్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. డోనాల్డ్ ట్రంప్, జో బైడెన్ ఇరువురు కూడా ర్యాలీలు, ప్రచార సభలతో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గతంలోలాగా కాకుండా వీరిద్దరి మధ్య తీవ్రమైన పోటీ నెలకొనడంతో ఎవరు విజయం సాధిస్తారోనని ప్రపంచదేశాల్లో ఆసక్తి నెలకుంది.

అమెరికాలో కరోనా విజృంభణ ఎక్కువగా ఉండడంతో పలు జాగ్రత్తలతో పోలింగ్ ఏర్పాట్లు చేశారు. మొత్తం 23.9 కోట్ల మంది ఓటర్లు ఉండగా, కరోనా నేపథ్యంలో దాదాపుగా 10 కోట్ల మంది ఇప్పటికే ముందస్తుగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మిగతా వారంతా మంగళవారం జరిగే పోలింగ్ లో పాల్గొననున్నారు. గత అధ్యక్షఎన్నికల్లో కంటే కూడా అధిక శాతం పోలింగ్ నమోదు అయ్యే అవకాశముందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =