కోవిడ్-19 యొక్క కొత్త ఎక్స్ఈ వేరియంట్ పై కేంద్ర ఆరోగ్యమంత్రి సమీక్షా సమావేశం

Union Health Minister Mansukh Mandaviya Held Review Meeting on New XE-variant of Covid-19, Union Health Minister Mansukh Mandaviya Held Review Meeting on New XE-variant, Union Health Minister Mansukh Mandaviya, Union Health Minister, Mansukh Mandaviya, Minister Mansukh Mandaviya Held Review Meeting on New XE-variant of Covid-19, New XE-variant of Covid-19, XE Variant, Review Meeting on New XE-variant, Corona Virus Variant XE, new Covid-19 cases, new Covid-19 cases In India, India Covid-19 Updates, India Covid-19 Live Updates, India Covid-19 Latest Updates, Coronavirus, coronavirus India, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant,, India Department of Health, India coronavirus, India coronavirus News, India coronavirus Live Updates, Mango News, Mango News Telugu,

దేశంలో ఒమిక్రాన్ కరోనా వేరియంట్ విజృంభణ అనంతరం కరోనా వలన ఏర్పడ్డ పరిస్థితులు తగ్గుముఖం పట్టి అన్ని రాష్ట్రాల్లో కార్యకలాపాలు గతంలోలాగానే కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఎక్స్ఈ’ పలు దేశాల్లో ప్రభావం చూపుతూ ఆందోళన కలిగిస్తుంది. దేశంలో కూడా గుజరాత్‌ రాష్ట్రంలో ఓ వ్యక్తికి ఎక్స్ఈ వేరియంట్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు కరోనా యొక్క కొత్త ఎక్స్ఈ వేరియంట్ పై దేశంలోని ముఖ్య నిపుణులు, అధికారులతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో కరోనా కేసులపై సమీక్ష చేస్తూ, కొత్త వేరియంట్స్ మరియు కేసులపై కొనసాగుతున్న పర్యవేక్షణను, నిఘాను మరింత పెంచాలని అధికారులను కేంద్రమంత్రి ఆదేశించారు.

వైద్య మౌలిక సదుపాయాలు, వనరుల విషయంపై చర్చిస్తూ, కరోనా చికిత్సకు అవసరమైన అవసరమైన మందులు మరియు ఔషధాల లభ్యతను నిరంతరం సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను పూర్తి స్థాయిలో నిర్వహించాలని, అర్హులందరికీ వ్యాక్సిన్ వేయాలని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవియా సూచించారు. ఈ సమావేశంలో నీతి అయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు డాక్టర్ వి.కె.పాల్, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బలరామ్ భార్గవ, ఎన్‌టిఎజిఐ డాక్టర్ ఎన్‌కె అరోరా మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − three =