దేశవ్యాప్తంగా 116 జిల్లాల్లో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమం

coronavirus news, Coronavirus News Updates, coronavirus vaccine, Coronavirus Vaccine In India, Coronavirus Vaccine News, Coronavirus Vaccine Updates, COVID 19 Vaccine, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution Dry Run, Covid-19 Vaccine Dry Run, COVID-19 Vaccine Dry Run Begins In India, Dry Run Started in 116 Districts Across the Country, Mango News Telugu

దేశవ్యాప్తంగా కరోనా వాక్సిన్ పంపిణీ సమర్థవంతంగా జరిగేందుకు సన్నద్ధం కావాలని అని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అందులో భాగంగా జనవరి 2, శనివారం నాడు డ్రైరన్ (వ్యాక్సిన్ సన్నాహక కార్యక్రమం) నిర్వహించాలని సూచించింది. దీంతో దేశవ్యాప్తంగా 116 జిల్లాల్లోని 259 ప్రదేశాల్లో శనివారం ఉదయం డ్రైరన్ ప్రారంభమైంది. అన్ని రాష్ట్రాలు కనీసం రెండు లేదా మూడు చోట్ల డ్రైరన్ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ఈ డ్రైరన్ లో వ్యాక్సిన్ ఇవ్వడం మినహా, పంపిణీ కోసం ఏర్పాటు చేసిన మిగిలిన అన్ని వ్యవస్థల పనితీరును పరిశీలిస్తున్నారు. పంపిణీలో ఎదురయ్యే ఇబ్బందులను ముందుగానే అంచనా వేయటానికి, ప్రణాళికకు, అమలుకు మధ్య ఏర్పడేందుకు అవకాశమున్న అవరోధాలను గుర్తించటానికి ఈ డ్రైరన్ కార్యక్రమం ఉపయోగపడనుంది. ఒక్కో సెంటర్ లో 25 మంది డ్రైరన్‌ లో పాల్గొంటుండగా వారి వివరాలను ముందుగానే కో-విన్ లో నమోదు చేస్తున్నారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 7 సెంటర్లలో డ్రై రన్‌ నిర్వహించారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి, నాంపల్లి ఏరియా ఆసుపత్రి, తిలక్‌నగర్‌ యూహెచ్‌సీ, సోమాజిగూడ యశోద హాస్పిటల్‌ నిర్వహించారు. అలాగే మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని జానంపేట పీహెచ్‌సీ, మహబూబ్‌నగర్‌ జీజీహెచ్‌, నేహా షైన్‌ ప్రైవేట్ ఆసుపత్రిలో డ్రైరన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా 13 జిల్లాల్లోని 39 కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ డ్రైరన్‌ నిర్వహించారు. ప్రతి జిల్లాలోని మూడు ఆస్పత్రులు ఎంపిక చేసి ఒక్కోచోట 25 మందికి చొప్పున డ్రైరన్‌ నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 8 =