చైనా ప్రయత్నాన్ని మన సైనికులు దృఢంగా తిప్పికొట్టారు, తవాంగ్ సెక్టార్‌ లో ఘర్షణపై రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటన

Defence Minister Rajnath Singh’s Statement On India-China Faceoff Incident At Tawang Sector Of Arunachal Pradesh,Our Soldiers Firmly Repelled Chinese Attempt, Rajnath Singh Statement,Tawang Sector Clash,Mango News,Mango News Telugu,Tension On India-China Border,Heavy Clash Between Soldiers,Defense Minister Rajnath Singh,Rajnath Singh High Level Meeting,Mango News,Mango News Telugu,Defence Minister Rajnath Singh,Holds High-Level Meet,Amid India-China Troops Clash,Lac In Arunachal'S Tawang Border,Arunachal's Tawang Border,Arunachal - Tawang Border,Indian Army,Chineese Army

అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని తవాంగ్‌ సెక్టార్‌ లో డిసెంబర్ 9న భారత్‌, చైనా దేశాల సైనికుల మధ్య ఘర్షణ చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై నేడు (డిసెంబర్ 13, మంగళవారం) పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేశారు. చైనా ప్రయత్నాన్ని మన సైనికులు దృఢంగా తిప్పికొట్టారు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ని మన భూభాగంలోకి అతిక్రమించకుండా భారత సైన్యం ధైర్యంగా నిరోధించిందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.

“2022, డిసెంబర్ 09న అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో మన సరిహద్దులో జరిగిన సంఘటన గురించి ఈ సభకు తెలియజేయాలనుకుంటున్నాను. 2022, డిసెంబర్ 09న పీఎల్ఏ దళాలు తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సే ప్రాంతంలో వాస్తవాధీన రేఖను అతిక్రమించి యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు ప్రయత్నించాయి. చైనా ప్రయత్నాన్ని మన సైనికులు బలంగా మరియు దృఢంగా ఎదుర్కొన్నారు. తదనంతర ముఖాముఖి భౌతిక ఘర్షణకు దారితీసింది, దీనిలో భారత సైన్యం పీఎల్ఏని మన భూభాగంలోకి అతిక్రమించకుండా ధైర్యంగా నిరోధించింది మరియు వారి స్థానాలకు తిరిగి వెళ్లాలని ఒత్తిడి చేసింది. ఈ తోపులాటలో ఇరువైపులా కొంతమంది సైనికులకు గాయాలయ్యాయి. మన వైపు ఎటువంటి ప్రాణనష్టం లేదా తీవ్రమైన గాయపడడం జరగలేదని నేను ఈ సభతో పంచుకోవాలనుకుంటున్నాను” అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

“భారత సైనిక కమాండర్ల సకాలంలో జోక్యం కారణంగా, పీఎల్ఏ సైనికులు తమ స్థానాలకు తిరిగి వెళ్లారు. ఈ సంఘటనకు కొనసాగింపుగా, ఆ ఏరియాలోని స్థానిక కమాండర్ 2022, డిసెంబర్ 11న చైనా రక్షణశాఖ అధికారులతో అక్కడ ఏర్పాటు చేసిన మెకానిజమ్స్ కు అనుగుణంగా సమస్యను చర్చించేందుకు ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించారు. ఇలాంటి చర్యలను మానుకోవాలని, సరిహద్దులో శాంతి, ప్రశాంతతను కాపాడాలని చైనా పక్షాన్ని కోరారు. ఈ సమస్యను దౌత్య మార్గాల ద్వారా చైనా వైపు కూడా తీసుకువెళ్లారు. మన బలగాలు మన దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్నాయని మరియు దానిపై చేసే ఏ ప్రయత్నాన్ని అయినా అడ్డుకోవడం కొనసాగిస్తామని నేను ఈ సభకు హామీ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ సభ మొత్తం మన సైనికుల ధైర్య ప్రయత్నానికి మద్దతుగా నిలుస్తుందని నేను విశ్వసిస్తున్నాను” అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − one =