ఎయిర్ ఇండియా ఘటనలో వ్యక్తి అరెస్ట్, బెంగళూరులో అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు

Delhi Police Arrested A Person Today Over Urinating on Co-Passenger in Air India Flight Incident, Air India Flight Incident, Delhi Police Arrested A Person, Man Urinating On Co-Passenger, Delhi Police Arrested Shankar Mishra, Shankar Mishra, Air India Flight Incident News, Air India Flight Incident Latest News And Updates, Air India Flight Incident Live Updates, Mango News, Mango News Telugu

ఎయిర్ ఇండియా విమానంలో మత్తులో సహ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటనలో ఢిల్లీ పోలీసులు ముందడుగు వేశారు. దీనికి కారకుడిగా భావిస్తున్న వ్యక్తిని ఎట్టకేలకు శనివారం బెంగళూరులో అరెస్ట్ చేశారు. అతడిని ముంబైకి చెందిన శంకర్ మిశ్రాగా గుర్తించిన ఢిల్లీ పోలీసులు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల సహకారంతో ఈరోజు అరెస్ట్ చేశారు. 34 ఏళ్ల మిశ్రా బెంగళూరులోని సంజానగర్ పోలీస్ లిమిట్స్‌లోని బంధువు ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఢిల్లీకి తరలించి తదుపరి విచారణ చేపట్టనున్నట్లు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఐజీఐ) రవికుమార్ సింగ్ తెలిపారు. ముందుగా శంకర్ మిశ్రాను స్థానిక కోర్టులో హాజరుపరిచేందుకు ఢిల్లీకి తీసుకువస్తున్నట్లు ఆయన ధృవీకరించారు.

కాగా బెంగుళూరులో శంకర్ మిశ్రాను పట్టుకునేందుకు పలు బృందాలను పంపామని, అతడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని రవికుమార్ తెలిపారు. అయితే కొన్ని రకాల సాంకేతిక నిఘా ఏర్పాటు చేసి చివరికి బెంగళూరులో ఉన్నట్లు కనిపెట్టామని వెల్లడించారు. అంతకుముందు ముంబైలోని కుర్లాలోని కమ్‌గర్ నగర్‌లోని శంకర్ మిశ్రా నివాసానికి పొలిసు బృందాలను పంపినప్పటికీ అతని జాడ తెలియలేదని తెలిపారు. అతని ఇంటికి తాళం వేసి ఉందని, అలాగే వారి కుటుంబ సభ్యులు విచారణకు సహకరించలేదని సింగ్ చెప్పారు. ఇక ఇదిలా ఉండగా శంకర్ మిశ్రా పనిచేస్తున్న అమెరికాలోని ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ‘వెల్స్ ఫార్గో’ దీనిపై స్పందించింది. తాము వృత్తిపరమైన మరియు వ్యక్తిగత ప్రవర్తన యొక్క అత్యున్నత ప్రమాణాలను పాటిస్తామని, ఇలాంటి చర్యలను తమ సంస్థ ఎట్టిపరిస్థితుల్లో సహకరించదని స్ఫష్టం చేసింది. అందుకే మిశ్రాను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

కాగా గతేడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో శంకర్ మిశ్రా మద్యం సేవించిన మత్తులో పక్కనున్న ఒక ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన అనంతరం ఆమె ఎయిర్ ఇండియా యాజమాన్యానికి లేఖ రాసింది. తాను ఫిర్యాదు చేసిన విమానంలోని సిబ్బంది సరిగా స్పందించలేదని ఆరోపించింది. దీంతో ఎయిర్ ఇండియాపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఘటనకు సంబంధించి విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో విమానం పైలట్ సహా ఎనిమిది మంది ఎయిర్ ఇండియా సిబ్బందికి పోలీసులు గతంలో సమన్లు ​​జారీ చేశారు. మిశ్రా పరారీలో ఉండటంతో ఆయనపై లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్‌ఓసి) కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులు నేడు శంకర్ మిశ్రాను బెంగళూరులో అరెస్ట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 16 =