ఈ భాగాల నుంచి చెమటలు పట్టడం గుండెపోటుకు సంకేతమా?

Is Sweating From These Parts A Sign Of Heart Attack,Signs Of Heart Attack,Causes Of Heart Attack,Heart Attack Symptoms,Mango News,Mango News Telugu,Heart Attack Treatment,Heart Attack Prevention,Heart Attack Symptoms Latest News,Heart Attack Symptoms Latest Updates,Heart Attack Causes,Heart Attack News,Heart Attack News India,Severe Heart Attack,Heart Attack
Sweating,heart attack, sweating from these parts, a sign of heart attack,Armpits, back, face, neck, forehead

ఒకప్పుడు 50 ప్లస్ వారిలో మాత్రమే కనిపించే గుండెపోట్లు..ఇప్పుడు 20 ప్లస్‌లోనూ కనిపించి అందరినీ షాక్‌లో పడేస్తున్నాయి. అప్పటివరకూ ఆడుతూ పాడుతూ ఉండేవాళ్లు కాస్త క్షణాల్లో గుండె పట్టుకుని కుప్పకూలిపోతున్నారు. అందులోనూ కరోనా తర్వాత ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. అనారోగ్యకరమైన జీవనశైలి, కలుషిత వాతావరణంతో పాటు కొలస్ట్రాల్ ఎక్కువ ఉన్న బేకరీ ఫుడ్స్ వంటివి ఎక్కువగా తినడం వల్ల గుండె సమస్యలు సర్వసాధారణంగా మారిపోయాయి. సకాలంలో చికిత్స చేయకపోతే గుండెపోటు ప్రాణాలు తీసేస్తుంది కాబట్టే ఇదంటే అందరికీ భయం.

గుండెపోటు వచ్చేముందు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని జాగ్రత్తగా గుర్తించినట్లయితే.. వెంటనే చికిత్స అందించి ప్రాణాలు కాపాడుకోవచ్చు. గుండెపోటు వచ్చే ముందు చాలా విపరీతంగా చెమటలు పడతాయి. అయితే ఈ చెమటను సాధారణ సమస్యగా భావించి చాలామంది అసలు పట్టించుకోరు.అయితే అది గుండెపోటుకు సంకేతం కూడా కావొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. గుండెపోటుకు ముందు, శరీరంలోని అనేక భాగాల నుంచి విపరీతమైన చెమట కారిపోతుంది. అయితే చెమటతో పాటు శ్వాస ఆడకపోవడం, అలసట, వికారం, ఛాతీలో భారం గుండెపోటు యొక్క లక్షణాలుగా డాక్టర్లు అంటున్నారు.

సాధారణంగానే ప్రతి ఒక్కరికీ చంకలు, వీపు నుంచి అన్ని కాలాలలో చెమట పడుతుంది.సమ్మర్‌లో అయితే ఈ సమస్య కాస్త ఎక్కువగా ఉంటుంది. కానీ గుండెపోటు వచ్చే ముందు కానీ.. వచ్చినపుడు కానీ..ఆ వ్యక్తి ముఖం,మెడ, నుదురు మీద చెమటలు ధారలుగా కారిపోతూ ఉంటుంది. అంతేకాదు ఈ సమయంలో అరచేతులు చల్లగా మారిపోతుండటంతో పాటు.. అరచేతుల్లో విపరీతమైన చెమటలు పడుతూ ఉంటే అది కూడా గుండెపోటుకు సంకేతం కావచ్చంటున్నారు డాక్టర్లు.

గుండెపోటు వచ్చే ముందు చెమటలు పట్టడానికి.. ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. గడ్డ కట్టే చలి ఉన్నా కూడా గుండెపోటు వచ్చే ముందు వారిలో చెమట బాగా పడుతుంది. గుండెపోటు వచ్చే ముందు.. ప్రధాన లక్షణం ఆక్సిజన్ గుండెకు చేరుకోదు. ఎందుకంటే ధమనులలో ఫలకం ఏర్పడినప్పుడు, ఆక్సిజన్ గుండెకు చేరుకోలేనప్పుడు మాత్రం శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి.. శరీరం చెమటను విడుదల చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.అందుకే కారణం లేకుండా విపరీతమైన చెమటతో పాటు ఆయాసం వచ్చినప్పుడు వెంటనే డాక్టర్లను సంప్రదించడం మంచిదని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =