మోత మోగనంటోన్న టమాట.. ధరలు దిగొస్తున్నాయ్

Good News For The Consumers Tomato Prices Slowly Drops After All Time High In India,Good News For The Consumers,Tomato Prices Slowly Drops,Tomato Prices After All Time High,Tomato Prices After All Time High In India,Mango News,Mango News Telugu,Good News For The Tomato Consumers,The Price Of Tomatoes Is Dropping, The Price Of Tomatoes,Tomatoes Price,Farmers Cultivate Tomato Crop, Tomato Farmers,Tomato Prices Latest News,Tomato Prices Latest Updates,Tomato Prices Live News

ఎప్పుడూ సామాన్యులకు అందుబాటులో ఉండే టమాట.. ఈ మధ్య వాళ్లకు చుక్కలు చూపించింది. రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతూ మధ్యతరగతి వాళ్లకు టమాట రుచిని దూరం చేసేసింది. అయితే ఎందుకో మళ్లీ అంతెత్తు నుంచి మెల్లమెల్లగా ఈ ధరలు దిగి వస్తున్నాయి. టమాటా ధరలు సగానికి తగ్గుముఖం పట్టడంతో.. మొన్నటి వరకు రూ.4300 పలికిన 23 కేజీల బాక్సు ధర ఆదివారం నుంచీ రూ.2300కి చేరింది. నాణ్యతను బట్టి ఒక్కో టమాటా బాక్సు రూ.1500 నుంచి రూ.2300 వరకు పలికింది. మొన్నటి వరకు డబుల్‌ సెంచరీ క్రాస్ అయిన టమోట.. ఇప్పుడు కిలో ధర రూ.65 నుంచి రూ.100కు పడిపోయింది. ములకలచెరువు వ్యవసాయ మార్కెట్‌లో మూడు రోజులుగా ఈ ధరలు తగ్గుతూ వస్తున్నాయి.

రెండు నెలలుగా టమాటా ధరలు ఆకాశాన్నండటంతో సామాన్యులు అల్లాడిపోయారు. టమాట కంటే చికెన్ ధరలు తక్కువవడంతో జనాలు టమాట వాసనను కూడా జనాలు మరచిపోయారు.ఇక సోషల్ మీడియాలో అయితే ఏకంగా దీనిపై లెక్కలేనన్ని మీమ్స్, కార్టూన్స్‌తో తెగ హెరెత్తించారు.ఇటు ప్రభుత్వాలు కూడా సామాన్యుల కోసం సబ్సిడీ ధరల్లో టమాట విక్రయ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశాయి. అవి ఏమాత్రం వినియోగదారులకు సరిపోవటం లేదన్న విమర్శలు తలెత్తుతున్న ఈ సమయంలోనే మూడు రోజులుగా టమాటా ధరలు సగానికి తగ్గుముఖం పట్టాయి. ఇంకా కొన్ని రోజులు ఇలాగే టమాట ధరలు మోత మోగిస్తాయని అంచనా వేసిన రైతులు ఇప్పుడు ధరలు తగ్గడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు మరింత తగ్గుతాయేమోనని దిగులు పడుతున్నారు.

ములకలచెరువు మార్కెట్‌ నుంచి మూడు రోజుల క్రితం వరకు 10 లోపు లారీల టమాటాలు మాత్రమే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం ధర తగ్గడంతో.. ప్రతి రోజూ చిన్న వాహనాలతో పాటు మొత్తం 20 లారీల టమాటాలు ఎగుమతి అవుతున్నాయి.అక్కడి నుంచి ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు వీటిని ఎగుమతి చేస్తున్నారు. అటు వైరస్‌ వల్ల కర్ణాటక రాష్ట్రంలో టమాటా పంటలు బాగా దెబ్బతినడంతో ధరలు నిలకడగా ఉండవచ్చని రైతులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం బయట రాష్ట్రాల్లో టమాటాల దిగుబడి పెరగడంతో పాటు.. ధర బాగా ఉండటంతో రైతులు టమాటా పంటను సాగు చేయడంతో.. టమాటా దిగుబడి పెరిగిందని నిపుణులు చెబుతున్నారు . వారం రోజుల కిందట మార్కెట్‌ యార్డుకు 100 క్వింటాళ్లలోపు టమాటాలు రాగా .. మూడు రోజుల నుంచి రోజుకు 300 క్వింటాళ్లకు పైగా వస్తున్నాయి. అయితే ధరలు తగ్గుముఖం పట్టినా..కొందరు వ్యాపారులు మాత్రం గతంలోని ధరలనే ఇప్పటికీ కొనసాగించడంతో.. దీనిపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 10 =