కొత్త ఫీచర్‌ను లైవ్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసిన ఎలాన్ మస్క్

Elon Musk Introduces New Feature Like Live Streaming For X Users,Elon Musk Introduces New Feature,New Feature Like Live Streaming,Live Streaming For X Users,New Feature For X Users,Mango News,Mango News Telugu,X CEO Elon Musk,Elon Musk Introduces Live Video Feature For X,X to Now Let Users Stream Live Videos,Elon Musk tests live video on X,Elon Musk introduces Live video feature,Elon Musk introduced the new feature live, Elon Musk, introduced the new feature, X Live Video, Live Video Feature,Elon Musk Latest News,Elon Musk Latest Updates

ట్విటర్‌ను హ్యాండోవర్ చేసుకున్నప్పటి నుంచీ ఎలాన్‌ మస్క్‌.. తన నిర్ణయాలతో షాకిస్తూనే కొత్త కొత్త ఫీచర్లను అందిస్తున్నాడు. రీసెంట్‌గా ఆ పేరుపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించినా కూడా ట్విటర్‌ పేరును ఎక్స్‌గా మార్చి అదే కంటెన్యూ చేస్తూ వస్తున్నారు. తాజాగా మస్క్ తమ యూజర్ల కోసం బ్లూటిక్‌ హైడ్‌, లైవ్‌ వీడియో ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఎప్పటిలాగే కొత్త ఫీచర్‌ను ట్వీట్‌తో ఇంట్రడ్యూస్ చేస్తాడనుకున్న తమ ఉద్యోగులకు.. ఈ సారి కాస్త క్రియేటివ్‌గా సర్ఫ్రైజ్ ఇచ్చాడు ఎలాన్‌ మస్క్‌. లైవ్ వీడియో ఫీచర్‌ను.. లైవ్‌లోనే ప్రసారం చేస్తూ ఎనౌన్స్ చేస్తూ నెటిజన్లకు కూడా ఎంటర్‌టైన్ పంచారు.

ఇప్పుడు లైవ్‌ వీడియో బాగా పనిచేస్తోంది. పోస్ట్‌ చేసేటప్పుడు కెమెరా ఫ్రంట్ బటన్‌ను తాకితే చాలు అని పోస్ట్‌ ద్వారా తన ఎక్స్ యాప్ వినియోగదారులకు చెప్పారు. అంతేకాదు విచిత్రమైన వీడియోతో తమ ఉద్యోగులకు వినోదం కలిగిస్తూ మస్క్‌ ఈ ఫీచర్‌ను స్వయంగా తానే పరీక్షిస్తూ పరిచయం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది

మొత్తం 50 సెకండ్ల నిడివితో ఉన్న ఈ వీడియోలో ఎలాన్‌ మస్క్‌ తనను తాను చెక్‌ చేసుకున్నారు. తర్వాత తనతో మాట్లాడుతున్న తమ ఉద్యోగుల మీదకు కెమెరాను ఫోకస్‌ చేశారు. అయితే.. నిజానికి ఇది లైవ్‌ వీడియో ఫీచర్‌ టెస్ట్ కోసం ఉద్దేశించిందని ఎక్స్‌ ఆ తర్వాత తెలిపింది.

ఈ వీడియోలో ఈ ఫీచర్‌ సరిగ్గా పనిచేస్తోందా? అని మస్క్‌ ఎక్స్‌లో.. వీక్షిస్తున్నవారిని ప్రశ్నించారు. సరిగా పనిచేస్తున్నట్టు కన్ఫమ్ చేసుకున్నాక మీటింగ్ టేబుల్‌ చుట్టూ కూర్చున్నవారిని వీడియోలో చూపించారు. ఆ తర్వాత మస్క్ ట్యాలెంట్‌ను మస్తుగా బయటకు లాగారు. ఏకంగా డంబెల్ ‌తీసుకొని ఆఫీసులో ఉద్యోగులందరి ముందు కాసేపు ఎక్సర్ సైజులు చేశారు.

దీంతో ఏది ఏమైనా మస్క్ అంటే మస్కే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏం చేయాలన్నా.. ఎలాంటి ఫీచర్లు ఇంట్రడ్యూస్ చేయాలన్నా ఆయనకే చెల్లుతుందని అంటున్నారు. ఎవరు నో అన్నా.. ఎవరు ఎస్ అన్నా.. చేయాలనుకున్నది చేసి తీరతాడని కామెంట్లు పెడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 7 =