దేశంలో 358కి చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య, ఒక్కరోజే 100కు పైగా కేసులు

Coronavirus, Coronavirus Cases, coronavirus cases in india state wise, coronavirus cases in india today state wise, coronavirus cases india, COVID-19, COVID-19 Cases in India, covid-19 new variant, Health Ministry Says so far 358 Omicron Variant Cases, Health Ministry Says so far 358 Omicron Variant Cases Reported, Health Ministry Says so far 358 Omicron Variant Cases Reported In the Country, India Omicron Cases, Mango News, Mango News Telugu, New coronavirus Strain, New Covid 19 Variant, New Covid Strain Omicron, Omicron, Omicron Cases In India, Omicron covid variant, Omicron scare, Omicron variant, Omicron Variant Cases, Update on Omicron

దేశంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి మరింత ఆందోళన కలిగిస్తుంది. రోజురోజుకి ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దేశంలో గురువారం ఉదయానికి ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 236 ఉండగా, ఒక్కరోజు వ్యవధిలోనే 100కి పైగా కేసులు నమోదవడంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 358కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. ఇప్పటివరకు మొత్తం 17 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైయినట్టు తెలిపారు. అత్యధికంగా మహారాష్ట్రలో 88, ఢిల్లీలో 67, తెలంగాణలో 38 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కాగా మొత్తం 358 బాధితుల్లో ఇప్పటికే 114 మంది ఈ వేరియంట్ నుంచి కోలుకునట్టు తెలిపారు.

దేశంలో ఒమిక్రాన్ కేసుల వివరాలు (358):

  1. మహారాష్ట్ర – 88
  2. ఢిల్లీ – 67
  3. తెలంగాణ – 38
  4. తమిళనాడు – 34
  5. కర్ణాటక – 31
  6. గుజరాత్ – 30
  7. కేరళ – 27
  8. రాజస్థాన్ – 22
  9. హర్యానా – 4
  10. ఒడిశా – 4
  11. జమ్మూ కాశ్మీర్ – 3
  12. వెస్ట్ బెంగాల్ – 3
  13. ఉత్తర్ ప్రదేశ్ – 2
  14. ఆంధ్రప్రదేశ్ – 2
  15. చండీఘర్ – 1
  16. లద్దాఖ్ – 1
  17. ఉత్తరాఖండ్ – 1
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 8 =