ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ గా టీమిండియా, వన్డేలు, టీ20ల్లో కూడా అగ్రస్థానం

ICC Rankings: Team India Now Top in Tests and Become Number 1 In All Formats,ICC World Test Championship,ICC World Test Championship 2023,World Test Championship 2023,Mango News,Mango News Telugu,Icc Test Championship Points Table 2023,World Test Championship 2023 Final Venue,World Test Championship Points Table,World Test Championship Schedule,Icc Test Ranking,World Test Championship Final Date,Icc World Test Championship 2023 Points Table,Icc World Test Championship 2023 Schedule,Icc World Test Championship 2023-25,Icc World Test Championship 2023 To 2025,Icc World Test Championship India Schedule 2021 To 2023,Icc World Test Championship Most Runs 2021 To 2023,Icc World Test Championship Schedule 2021 To 2023,Icc Test Championship Schedule 2023

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం నాడు ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌ను అప్ డేట్ చేసింది. ఈ నేపథ్యంలో టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌లోని వీసీఏ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తోలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియాను వెనక్కినెట్టిన భారత్ 115 రేటింగ్ పాయింట్లతో టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరింది. ఆస్ట్రేలియా 111 పాయింట్స్ తో రెండో స్థానంలో నిలువగా, ఇంగ్లాండ్ జట్టు 106 పాయింట్స్ తో మూడో స్థానంలో ఉంది.

ఇప్పటికే టీమిండియా ఐసీసీ వన్డే, టీ20 టీమ్ ర్యాంకింగ్స్ లో కూడా అగ్రస్థానంలో ఉంది. తాజాగా టెస్ట్ ర్యాకింగ్స్ లో కూడా టాప్ లోకి దూసుకెళ్లడంతో అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఘనత ప్రపంచ క్రికెట్‌లో భారత్‌ ఆధిపత్యాన్ని చూపిస్తుంది. మొత్తం 3 ఫార్మాట్లలో ఏకకాలంలో నెం.1గా నిలిచిన తొలి ఆసియా జట్టుగా భారత్ నిలిచింది. అలాగే ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ టీ20 బ్యాటర్ గా సూర్యకుమార్ యాదవ్, వన్డే నెంబర్ వన్ బౌలర్ గా మహమ్మద్ షమీ, నంబర్ వన్ టెస్ట్ ఆల్ రౌండర్ గా రవీంద్ర జడేజా కొనసాగుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =