నేడే ఆస్ట్రేలియాతో భారత్ మూడో వన్డే.. సిరీస్‌ కోసం ఇరు జట్లు హోరాహోరీ

Ind vs Aus 3rd ODI Team India Aim To Seal The Series Against Australia in The Third Match at Chennai,Ind vs Aus 3rd ODI,Team India Aim To Seal The Series,India Against Australia in The Third Match at Chennai,Mango News,Mango News Telugu,Live Score IND VS AUS,Ind vs Aus,Race for World No.1 ODI Team,India vs Australia,Suryakumar Yadav to Bat,India vs Australia 3rd ODI,India vs Australia Highlights,IND VS AUS Live Updates,3rd ODI Cricket Match Live Score,IND vs AUS Weather Report Live Today,Third ODI Between India and Australia,India vs Australia Live News

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియాతో కీలకమైన మూడో వన్డేలో భారత్ తలపడనుంది. తొలి మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్ సిరీస్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. అయితే, విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. ఫలితంగా డు వన్డేల సిరీస్‌ 1-1తో సమంగా నిలిచింది. బ్యాటింగ్ సహా అన్ని విభాగాల్లో విఫలమైన భారత్.. భారీగా మూల్యం చెల్లించుకుంది. ఆసీస్ బౌలర్ స్టార్క్ ధాటికి 117 పరుగుల స్వల్ప లక్ష్యానికే పరిమితమైన టీమిండియా.. అనంతరం బౌలింగ్‌లోనూ విఫలమైంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(51), మిచెల్ మార్ష్(66) అర్ధశతకాలతో విజృంభించి స్వల్ప లక్ష్యాన్ని 11 ఓవర్లలోనే ఛేదించారు.

దీంతో మూడో, నిర్ణాయక చివరి గేమ్‌లో ఇరు జట్లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నాయి. భారత బ్యాటర్లలో ప్రధానంగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బ్యాటింగ్ సంచలనం సూర్యకుమార్ యాదవ్ ఘోరంగా విఫలమవుతుండటం జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. నేటి మ్యాచ్‌లో వీరిద్దరూ చెలరేగాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. వీరికి తోడు కెప్టెన్ రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ కూడా సత్తా చాటితే భారత్ ఆసీస్ ముందు భారీ స్కోరు ఉంచే అవకాశం ఉంటుంది. మరోవైపు రెండో మ్యాచ్‌లో పుంజుకోవడం ద్వారా ఆస్ట్రేలియా రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. దీంతో నేటి మ్యాచ్‌లో ఇరు జట్లూ హోరాహోరీగా పోరాడనున్నాయి.

జట్లు అంచనా

భారత జట్టు: రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (సి), మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here