జమ్మూకశ్మీర్‌లో హై అలర్ట్.. ఆర్మీ ట్రక్కుపై ఉగ్ర దాడి, ఐదుగురు జవాన్ల సజీవ దహనం

Jammu and Kashmir Five Jawans Lost Lives at Poonch District as Terrorists Attacks on Indian Army Truck,Jammu and Kashmir Five Jawans Lost Lives,Five Jawans Lost Lives at Poonch District,Terrorists Attacks on Indian Army Truck,Mango News,Mango News Telugu,NIA Team to Visit J-K's Poonch Terror Attack,Jaish Claims Attack on Soldiers in J&K's Poonch,Poonch terror attack,5 Army soldiers killed,Army releases names of soldiers killed,Hunt For Terrorists,Massive search operations underway,Jammu and Kashmir Latest News,Jammu and Kashmir Live Updates,Jammu and Kashmir Terrorists Attack News

జమ్మూకశ్మీర్‌లో దారుణం చోటుచేసుకుంది. పూంచ్‌ జిల్లాలో రాష్ట్రీయ రైఫిల్స్‌ యూనిట్‌(ఆర్‌ఆర్‌యూ) జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు సజీవ దహనమవగా.. మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. భారత సైన్యం, పోలీసుల కథనం ప్రకారం.. రాజౌరీ సెక్టార్‌లోని అడవుల్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని ఇటీవల ఇంటెలిజెన్స్‌ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. జీ-20 సమావేశాన్ని వ్యతిరేకిస్తున్న జైషే మహమ్మద్‌, దాని అనుబంధ సంస్థలు గ్రనేడ్‌ దాడులకు పాల్పడే ప్రమాదముందని తెలిపింది. దీంతో శ్రీనగర్‌, దక్షిణ కశ్మీర్‌, రాజౌరీ, పూంచ్‌ సెక్టార్లలో అప్రమత్తంగాఉండాలని, భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఈ ఘటన నేపథ్యంలో.. ఉగ్రదాడి తర్వాత భింబర్ గలి, భాటా ధురియన్ మధ్య జాతీయ రహదారిపై అన్ని రకాల వాహనాల రాకపోకలు నిలిపివేశారు. అలాగే జమ్మూలోనిఅంతర్జాతీయ సరిహద్దులతో పాటు, దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్‌, ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా, ఉరి సెక్టార్‌ తదితర ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో.. ఉగ్రవాదుల జాడపై నిఘావర్గాల ద్వారా ఆర్మీకి సమాచారం అందడంతో ముష్కరులు దాగి ఉన్న అటవీ ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా చుట్టుముట్టి, దాడి చేయాలని ఆర్మీ నిర్ణయించింది. యాంటీ టెర్రరిస్ట్‌ ఆపరేషన్‌ కోసం రాష్ట్రీయ రైఫిల్స్‌ యూనిట్స్‌ను ఆయా ప్రాంతాలకు తరలించింది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రాజౌరీ సెక్టార్‌లోని భీంబేర్‌గలీ నుంచి పూంచ్‌ వెళ్తున్న ఆర్‌ఆర్‌యూ జవాన్ల ట్రక్కుపై పీఏఎ్‌ఫఎఫ్‌ ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. అయితే ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో రహదారి స్పష్టంగా కనిపించని కారణంగా అక్కడే నక్కి ఉన్న ఉగ్రమూకలను జవాన్లు గుర్తించలేదని, తొలుత కాల్పులు జరిపిన ఉగ్రవాదులు ఆ తర్వాత గ్రనేడ్‌ లాంచర్‌తో దాడి చేశారని ఆర్మీ అధికారులు వెల్లడించారు.

కాగా ఈ దాడిలో ట్రక్కు పూర్తిగా దహనమైంది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు జవాన్లు సజీవ దహనమయ్యారు. మరో సైనికుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతణ్ని రాజౌరీ ఆర్మీ ఆస్పత్రికి తరలించామని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. అయితే దాడి సమయంలో ట్రక్కులో కిరోసిన్‌ ఉండడంతో మంటల తీవ్రత మరింతగా పెరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ పాండే దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అమర జవాన్ల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అటు కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, సీనియర్‌ నేత రాహుల్‌గాంధీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ ఘటనను ఖండించారు. కాగా పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో భారత్‌ పర్యటన ఖరారైన కొన్ని గంటల్లోనే జమ్మూకశ్మీర్‌లో పాక్‌ ప్రేరేపిత ఉగ్రమూకలు దారుణానికి పాల్పడటం గమనార్హం. వచ్చేనెల శ్రీనగర్‌లో జరగనున్న జీ-20 టూరిజం వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాన్ని వ్యతిరేకించిన లష్కరే తాయిబా అనుబంధ సంస్థ పీపుల్స్‌ యాంటీ-ఫాసిస్ట్‌ ఫ్రంట్‌ ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =