జీన్స్, టీ షర్ట్స్, స్పోర్ట్స్ షూస్ ధరించి రావొద్దు – సీబీఐ డైరెక్టర్

CBI asks staff to wear only formals, CBI Director Issued Orders, CBI Employees, CBI Employees Dress Code, CBI Issues Dress Code for Employees, cbi office dress code, cbi office employees cannot wear jeans, CBI Officers Will No Longer Be Seen In Jeans T Shirts, Dress code applicable to CBI officers, Jeans, Jeans T-shirts Sports Shoes Not Allowed for CBI Employees, Mango News, Sports Shoes Not Allowed for CBI Employees, T-shirts

సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నూతన డైరెక్ట‌ర్ గా సుబోధ్ కుమార్ జైస్వాల్ ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా సీబీఐ అధికారులు, సిబ్బందికి ఆయన కీల‌క దేశాలు జారీ చేశారు. ఇకపై అధికారులు, సిబ్బంది సీబీఐ కార్యాలయంలోకి టీషర్ట్, జీన్స్‌, స్పోర్ట్‌ షూస్‌ ధరించి రాకూడదని పేర్కొన్నారు. అందరికి ఫార్మల్‌ దుస్తులు ధరించడం తప్పనిసరి చేస్తునట్టు చెప్పారు. పురుషుల ఫార్మల్ ష‌ర్ట్స్‌, ఫార్మ‌ల్ ప్యాంట్లు, ఫార్మ‌ల్ షూస్ వంటి డ్రస్ కోడ్ పాటించాలని, అలాగే ప్ర‌తి రోజూ క్లీన్‌షేవ్‌ చేసుకుని కార్యాలయానికి హాజరు కావాలని పేర్కొన్నారు.

ఇక సీబీఐ మ‌హిళా అధికారులు చీర‌లు, సూట్లు, ఫార్మ‌ల్ ష‌ర్ట్స్ వంటి డ్రస్ కోడ్ అనుసరించాలని చెప్పారు. ఇకపై జీన్స్, టీ షర్ట్స్, స్పోర్ట్స్ షూస్, చప్పల్స్, క్యాజువల్ వేషధారణతో కార్యాలయంలో అనుమతించబడరని తెలిపారు. ఈ మార్గదర్శకాలను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హెడ్ బ్రాంచెస్ లో కూడా ఖచ్చితంగా పాటించేలా చూడాలని సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =