స్పోర్ట్స్‌ యూనివర్సిటీకి తోలి వీసీగా కరణం మల్లీశ్వరిని నియమించిన ఢిల్లీ ప్రభుత్వం

Karnam Ma Delhi Sports University, Delhi Sports University first VC appointed, First Vice-Chancellor of Delhi Sports University, Karnam Malleswari, Karnam Malleswari Appointed as First Vice-Chancellor, Karnam Malleswari Appointed as First Vice-Chancellor of Delhi Sports University, Karnam Malleswari Becomes The First Vice-Chancellor, Karnam Malleswari made first Vice-Chancellor of Delhi Sports, Karnam Malleswari to be first VC of Delhi Sports University, Mango News, Olympic medallist Karnam Malleswari, Weightlifter Karnam Malleswarialleswari Appointed as First Vice-Chancellor of Delhi Sports University

ప్రముఖ వెయిట్‌ లిప్టింగ్ క్రీడాకారిణి, ఒలింపిక్‌ పతక విజేత కరణం మల్లీశ్వరి ఢిల్లీ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే దేశ రాజధాని ఢిల్లీలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆ యూనివర్సిటీకి తోలి వైస్ ఛాన్సలర్ గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కరణం మల్లీశ్వరిని నియమించారు.

శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస మండలంలోని ఊసవానివానిపేట గ్రామానికి చెందిన కరణం మల్లేశ్వరి వెయిట్‌ లిప్టింగ్ లో ఎంతో ఘనత సాధించారు. 2000లో సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్‌ లిప్టింగ్ 69 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించి, ఒలింపిక్స్‌ లో పతకం సాధించిన మొట్టమొదటి భారత మహిళగా కరణం మల్లీశ్వరి చరిత్ర సృష్టించారు. ఆమె 1994 లో అర్జున అవార్డు, 1999 లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అందుకున్నారు. అలాగే 1999 లో కేంద్రప్రభుత్వం ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఏథెన్స్ 2004 ఒలింపిక్స్‌ తరువాత ఆమె రిటైర్మెంట్ ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + nineteen =