విమానాల్లో ఇకపై మాస్క్‌లు ధరించడం తప్పనిసరి కాదు, కేంద్రం కీలక నిర్ణయం

Ministry of Civil Aviation Announces Wearing Masks No Longer Mandatory in Flights,Civil Aviation Ministry,Mask Not Mandatory On Flights,Wearing Mask Not Mandatory,Mango News,Mango News Telugu,Civil Aviation Ministry Latest News And Updates,Face Masks No Longer Mandated,Face Masks In Flights,Wearing Masks on Flights,Maks Airports No Longer Mandatory,Government Says Masks Not Mandatory,Masks Not Mandatory,Mask News And Live Updates

దేశీయ, అంతర్జాతీయ విమాన కార్యకలాపాల కోసం కోవిడ్-19 మార్గదర్శకాల సమీక్షలో భాగంగా విమానాల్లో మాస్క్/ఫేస్ కవర్లకు సంబంధించి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల్లో ఇకపై మాస్క్‌లు ధరించడం తప్పనిసరి కాదని కేంద్ర పౌర విమానయాన శాఖ బుధవారం తెలిపింది. అయితే కేసులు తగ్గుతున్నప్పటికీ ప్రయాణికులు మాస్కులు ధరించడమే మంచిదని సూచించారు. విమాన ప్రయాణంలో మాస్క్ లేదా ఫేస్ కవర్లను తప్పనిసరిగా ఉపయోగించాల్సిన అవసరానికి సంబంధించిన విషయంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో సంప్రదించి సమీక్షించినట్టు తెలిపారు.

కోవిడ్-19 నిర్వహణ ప్రతిస్పందన యొక్క గ్రేడెడ్ అప్రోచ్ యొక్క భారత ప్రభుత్వ విధానానికి అనుగుణంగా, ఇకపై కోవిడ్-19 వల్ల ఎదురయ్యే ముప్పు దృష్ట్యా, ప్రయాణీకులందరూ మాస్క్/ఫేస్ కవర్లను ఉపయోగించాలని మాత్రమే విమానంలోని ప్రకటనల్లో పేర్కొంటారని తెలిపారు. ఇన్‌ఫ్లైట్ ప్రకటనల్లో భాగంగా ప్రయాణికులు మాస్క్ ధరించకపోతే జరిమానా/శిక్షాస్పద చర్యకు సంబంధించిన ఏదైనా నిర్దిష్ట సూచనను ఇకపై ప్రకటించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ మేరకు ప్రయాణీకులు, విమానాశ్రయ ఆపరేటర్లు మరియు విమానయాన సంస్థలు కోసం 2022, మే 10న జారీ చేయబడిన దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాల కోసం ఏకీకృత కోవిడ్-19 సూచనలు సవరించబడ్డాయని కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 12 =