అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన పార్థివ్ పటేల్

Parthiv Patel Announces Retirement From All Forms Of Cricket,Parthiv Patel,IPL,ODI Cricket,Test Cricket,T20 Cricket,Parthiv Patel Announces Retirement From All Format's Of Cricket,Parthiv Patel Announces Retirement,Parthiv Patel Announces Retirement From All Format,Parthiv Patel Announces Retirement,Parthiv Patel Announces Retirement From All Forms,Parthiv Patel Announced Retirement From Cricket,Parthiv Patel,Parthiv Patel Retirement,Parthiv Patel Retirement From Cricket,Parthiv Patel Retirement News,Cricket,Indian Cricket,Cricket,Parthiv Patel Latest News,Parthiv Patel News

టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ పార్థివ్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ఇస్తున్నట్లుగా బుధవారం నాడు పార్థివ్ పటేల్ ప్రకటన చేశాడు. 17 సంవత్సరాల వయసులోనే 2002వ సంవత్సరంలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌ ద్వారా పార్థివ్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్‌లో కి అడుగుపెట్టాడు. పిన్న వయసులోనే టెస్టు క్రికెట్ లో అరంగేట్రం చేసిన వికెట్ కీప‌ర్‌గా పార్థివ్ రికార్డు సృష్టించాడు.

భారత్ తరపున పార్థివ్ మొత్తం 38 వన్డేలు, 25 టెస్ట్‌లు, 2 టీ-20 మ్యాచుల్లో ఆడాడు. ‌అన్ని ఫార్మాట్లలో కలిపి 1706 పరుగులు, 93 క్యాచ్‌లు, 19 స్టంపిం‍గ్స్‌ చేశాడు. పార్థివ్ చివరిసారిగా భారత్ తరపున 2018 లో జొహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఆడాడు. మరోవైపు ఐపీఎల్‌లో పార్థివ్‌ పటేల్‌ ఇప్పటికి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, డెక్కన్‌ చార్జర్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =