130 కోట్ల మంది భారతీయుల తరపున వైద్యులకు కృతజ్ఞతలు చెబుతున్నా : ప్రధాని మోదీ

amit shah, Happy Doctor’s Day 2021 Wishes, K Chandrasekhar Rao, KCR has Greeted Doctors, Mango News, National Doctor Day, National Doctors Day, National Doctors Day 2021, PM Modi, PM Modi Amit Shah And Others Laud Contribution Of Doctors, Telangana, Telangana CM greets Doctors on national Doctor’s day, VP Venkaiah Naidu

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా గురువారం నాడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నిర్వహించిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ వైద్యులను ఉద్దేశించి ప్రసంగించారు. డాక్టర్ బిసి రాయ్ జ్ఞాపకార్థం జరుపుకునే ఈ రోజు వైద్య రంగం యొక్క అత్యున్నత ఆదర్శాలకు ప్రతీక అని అన్నారు. గత ఒకటిన్నర సంవత్సరంగా కరోనా మహమ్మారి కష్ట సమయంలో చేసిన సేవలకు 130 కోట్ల మంది భారతీయుల తరపున వైద్యులకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మహమ్మారి సమయంలో వైద్యుల సహకారం, వీరోచిత ప్రయత్నాలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. మానవత్వ సేవలో తమ ప్రాణాలను అర్పించిన వైద్యులకు నివాళులర్పించారు. కరోనా విసిరిన అన్ని సవాళ్లకు మన శాస్త్రవేత్తలు, వైద్యులు పరిష్కారాలు కనుగొన్నారని, వైద్యులు వారి అనుభవం మరియు నైపుణ్యం ఆధారంగా ఈ కొత్త మరియు వేగంగా మ్యుటేట్ అవుతున్న వైరస్ ను ఎదుర్కొంటున్నారని అన్నారు.

ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, మొదటి కరోనా వేవ్ సమయంలో ఆరోగ్య సంరక్షణ కోసం సుమారు రూ.15 వేల కోట్లు కేటాయించామన్నారు. ఈ ఏడాది ఆరోగ్య రంగ బడ్జెట్‌ను రెట్టింపు చేసి రూ.2 లక్షల కోట్లకుపైగా పెంచామని, తక్కువ సేవలందుతున్న ప్రాంతాల్లో ఆరోగ్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి క్రెడిట్ గ్యారెంటీ పథకానికి రూ.50 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. కొత్త ఎయిమ్స్‌లు, మెడికల్ కాలేజీలు స్థాపించబడుతున్నాయని ప్రధాని అన్నారు.

వైద్యుల భద్రత కోసం ప్రభుత్వ నిబద్ధతతో ఉంటుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. కోవిడ్ యోధులైన వైద్యుల కోసం ఉచిత బీమా కవర్ పథకాన్ని తీసుకురావడంతో పాటుగా, వైద్యులపై హింసను నివారించడానికి తీసుకువచ్చిన కఠినమైన చట్టాలను గురించి ప్రధాని ప్రస్తావించారు. కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి, కరోనా నిబంధనలు పాటించడంపై ప్రజలను ప్రేరేపించడం కొనసాగించాలని ప్రధాని వైద్యులను పిలుపునిచ్చారు. అలాగే యోగా గురించి అవగాహన కల్పించినందుకు వైద్యసిబ్బందిని ప్రశంసించారు. వైద్యుల అనుభవాల డాక్యుమెంటేషన్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలని చెప్పారు. వైద్యుల అనుభవాలతో పాటు, రోగుల లక్షణాలు మరియు చికిత్స ప్రణాళికను గొప్ప వివరాలతో నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత శతాబ్దం యొక్క మహమ్మారి గురించి ఎటువంటి డాక్యుమెంటేషన్ అందుబాటులో లేదని, కానీ ఇప్పుడు ఉన్న సాంకేతికతతో కోవిడ్‌ను ఎలా ఎదుర్కొన్నామో రూపొందించే మన డాక్యుమెంటేషన్ మానవాళికి సహాయపడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 11 =