కాంగ్రెస్ పార్టీకి షాక్, సీనియర్ నాయకుడు ఆర్‌పిఎన్ సింగ్ రాజీనామా

2022 Up Assembly Elections, Another Senior Congress Exit, joins BJP ahead of UP Elections, Likely to Join BJP Today, Mango News, RPN Singh is a coward says Congress, RPN Singh Joins BJP Ahead Of UP Election, RPN Singh quits Congress, Senior Congress leader RPN Singh quits party, Senior Congress Leader RPN Singh Quits the Party, Senior Congress Leader RPN Singh Quits the Party Likely to Join BJP Today, UP Elections, UP Polls

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గానూ ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 03, 07 తేదీల్లో 7 విడతల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ‌ ఎన్నికల నేపథ్యంలో యూపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల్లో పలువురు కీలక నాయకులు పార్టీలు మారుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి, యూపీలో కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖ నాయకులలో ఒకరైన ఆర్‌పిఎన్ సింగ్ పార్టీని వీడారు. ఈ మేరకు మంగళవారం ఉదయం తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీకి పంపారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, దేశ ప్రజలకు, పార్టీకి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తన రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నారు.

కాగా రాజీనామా చేసిన కొద్దిసేపటికే తాను బీజేపీలో చేరడంపై ఆర్‌పిఎన్ సింగ్ ట్విట్టర్ లో ప్రకటన చేశారు. “ఇది నాకు కొత్త ప్రారంభం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మరియు హోం మంత్రి అమిత్ షాల దార్శనిక నాయకత్వం మరియు మార్గదర్శకత్వంలో దేశ నిర్మాణానికి నా సహకారం కోసం నేను ఎదురు చూస్తున్నాను” అని ఆర్‌పిఎన్ సింగ్ తెలిపారు. ఈరోజు సాయంత్రం ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఆర్‌పిఎన్ సింగ్ పద్రౌనా నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే 2009లో ఖుషీనగర్ నుంచి ఎంపీగా ఎన్నికైన ఆయన 2014లో ఓడిపోయారు. అయితే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పద్రౌనా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా, ఇటీవలే బీజేపీని వీడిన స్వామి ప్రసాద్ మౌర్యపై ఆర్‌పిఎన్ సింగ్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =