టీమిండియా స్టార్ బ్యాటర్, పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ

Team India Batting Icon Virat Kohli Celebrates his 34th Birthday Wishes Pouring From Cricketers Celebrities, Team India Batting Icon Virat Kohli Celebrates his 34th Birthday, Wishes Pouring From Cricketers, Virat Kohli Celebrities Wishes,MAngo NEws,Mango News Telugu, Virat Kohli 34th Bday, Virat Kohli Latest News And Updates, Virat Kohli Birthday, Virat Kohli Birthday 2022, Virat Kohli Bday Celebrations Latest Updates, Virat Kohli News And Live Updates

టీమిండియా బ్యాటింగ్ సంచలనం, స్టార్ బ్యాటర్, కింగ్ విరాట్ కోహ్లీ ఈ రోజు తన 34వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా ద్వారా బీసీసీఐ, భారత్ క్రికెటర్స్, పలుదేశాల క్రికెటర్స్, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, క్రీడాభిమానులు విరాట్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న T20 ప్రపంచకప్‌-2022లో కోహ్లీ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో 220 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

కింగ్ కోహ్లీ ఇప్పటివరకు తన కెరీర్‌లో టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి మొత్తం 477 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. ఇప్పటికి మొత్తం 24350 పరుగులు చేయడంతో పాటుగా, 2011 ఐసీసీ వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. భారత్ జట్టు కెప్టెన్ కూడా టెస్టులు, వన్డేలు, టీ20లలో విరాట్ కోహ్లీ సంచలన విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డ్ నెలకొల్పుతూ, ప్రపంచ క్రికెట్ లోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా నిలిచిన విరాట్ కోహ్లీ మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 3 =