ఒంటరిగా విమానంలో ప్రపంచ యాత్ర చేసి గిన్నిస్ రికార్డు సాధించిన 19 ఏళ్ల యువతి

ఆ యువతి వయసు 19. సాధారణంగా ఆ వయసులో కొంతమందికి లోక జ్ఞానం కూడా ఉండదు. అయితే సదరు యువతి మాత్రం ఒంటరిగా ప్రపంచాన్నే చుట్టేసింది. 5 నెలల్లో ఓ బుల్లి విమానంలో ప్రయాణించి ప్రపంచ దేశాలను చుట్టొచ్చింది. దాంతో గిన్నీస్‌ బుక్ ఆఫ్ వరల్డ్‌ రికార్డు ఆమె సొంతమైంది. అతి చిన్న వయసులో ప్రపంచాన్ని చుట్టొచ్చిన మహిళగా బెల్జియం కు చెందిన జరా రూథర్‌ ఫర్డ్ ప్రపంచ రికార్డు నెలకొల్పారు.

155 రోజుల్లో ఏకంగా 52వేల కిలోమీటర్లు ప్రయాణించారు. విభిన్న ఉష్ణోగ్రతల మధ్య 5 ఖండాల్లోని సుమారు 41 దేశాలను సందర్శించారు. తన సాహస యాత్ర ముగించి స్వదేశంలోకి అడుగు పెట్టిన వెంటనే తల్లిదండ్రులను ముద్దాడి తన సంతోషం వ్యక్తం చేశారు జరా రూథర్‌ ఫర్డ్. జరా‌కు చిన్నతనం నుంచే పైలట్‌గా రాణించడం కల. అందులోనూ ఆమె తల్లిదండ్రులు కూడా పైలట్‌లే. ఇంకేముంది.. ఆరేళ్లకే చిన్న చిన్న విమానాల్లో ప్రయాణించడం ప్రారంభించింది. 14 ఏళ్లకే సొంతంగా విమానం నడపడంలో ఆరితేరింది.

ఈ క్రమంలోనే.. ఒక శుభ ముహూర్తాన ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టి రావాలని నిర్ణయించుకుంది. తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు 2021 ఆగస్టు 18న శ్రీకారం చుట్టింది. ఒక బుల్లి విమానంలో ప్రపంచ యాత్రకు బయలుదేరింది. వాస్తవానికి ఆమె ప్రపంచ యాత్ర మూడు నెలల్లోనే పూర్తి చేయాలనుకుంది. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వీసా సమస్యల వల్ల ఐదు నెలల కాలం పట్టింది. 155 రోజుల తర్వాత.. గురువారం స్వదేశంలోకి అడుగు పెట్టిన ఆమెకు ఘనస్వాగతం లభించింది. బెల్జియం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన నాలుగు విమానాలు ఎస్కార్టుగా వచ్చి స్వాగతం పలకడం విశేషం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 6 =