ఢిల్లీలో ఎల్లో అలర్ట్ ఆంక్షలు: సినిమా హాళ్లు, స్కూల్స్, జిమ్స్ మూసివేత

Cinema halls, Cinema Halls Schools Colleges will be Closed, COVID-19, Covid-19 Restrictions In Delhi, Delhi Covid curbs, Delhi Curbs, Delhi omicron, Delhi omicron cases, Delhi On Yellow Alert As Covid-19 Cases Spike, Delhi Schools Colleges closed with immediate effect, Delhi tightens Covid curbs amid Omicron threat, Delhi Yellow Alert Rules Guidelines, Mango News, Omicron Effect, Omicron surge, Schools Colleges will be Closed, Yellow Alert in Delhi, Yellow alert in Delhi over rising Covid cases

కోవిడ్-19 పాజిటివిటీ రేటు పెరుగుదల, భారీగా ఒమిక్రాన్‌ వేరియంట్ కేసుల నమోదు నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ ప్రకటిస్తున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లెవెల్-1 (ఎల్లో అలర్ట్) కింద ఢిల్లీలో తక్షణమే కోవిడ్-19 పరిమితులు అమల్లోకి వస్తాయని చెప్పారు. ముందుగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో కోవిడ్ పరిస్థితిపై సమావేశం నిర్వహించి, వైరస్ వ్యాప్తి కట్టడికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఢిల్లీలో రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉండగా, తాజాగా ఎల్లో అలర్ట్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

ఎల్లో అలర్ట్ నిబంధనల్లో భాగంగా బేసి-సరి పద్ధతి ప్రకారం అత్యవసరం కానీ సేవలు లేదా వస్తువుల దుకాణాలు మరియు మాల్స్ ఉదయం 10 నుండి రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉండాలి. రెస్టారెంట్లు 50 శాతం సీటింగ్ కెపాసిటీతో ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు, బార్లు కూడా 50 శాతం సీటింగ్ తో మధ్యాహ్నం 12 నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచేందుకు ఉంటుంది. హోటల్‌లు తెరుచుకోవచ్చు గాని, హోటల్స్ లోపల విందు మరియు సమావేశ మందిరాలకు అనుమతి లేదు. ఇక మెట్రోకు 50 శాతం సీటింగ్ కెపాసిటీతో అనుమతి ఉండగా, ఇతర రాష్ట్రానికి వెళ్లే బస్సులు కూడా 50 శాతం సీటింగ్ కెపాసిటీతో నడిపించాలని పేర్కొన్నారు. వివాహ వేడుకలు, అంత్యక్రియలకు కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ప్రైవేట్ కార్యాలయాలు 50 శాతం సామర్థ్యంతో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. ఢిల్లీలో మతపరమైన ప్రదేశాలు తెరిచే ఉంటాయి కానీ భక్తుల ప్రవేశంపై నిషేధం ఉంటుందని పేర్కొన్నారు.

సినిమా హాళ్లు, స్కూల్స్, జిమ్స్ మూసివేత:

మరోవైపు సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు, పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలు మరియు కోచింగ్ సంస్థలుబాంకెట్ హాల్స్, ఆడిటోరియంలు, స్పాలు, జిమ్‌లు, యోగా ఇన్‌స్టిట్యూట్‌లు మరియు ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు మూసివేయబడతాయని ప్రకటించారు. అయితే సెలూన్లు మరియు బ్యూటీ పార్లర్లు తెరిచి ఉంటాయని తెలిపారు. కాగా ఢిల్లీలో ఇప్పటివరకు 165 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − nine =