మునుగోడులో బండి సంజయ్‌ ప్రచారం చేయకుండా నిషేధం విధించండి – ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్‌ఎస్

Munugode Bypoll TRS Leaders Complaint to EC Against Telangana BJP Chief Bandi Sanjay, Munugode TRS Leaders Complaint to EC, TRS Leaders Complaint on Bandi Sanjay, Telangana BJP Chief Bandi Sanjay, Mango News, Mango News Telugu, TRS Party, Munugode By-Poll, TRS Party Munugode By-Poll, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య పోరు తారాస్థాయికి చేరుకుంటోంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌పై అధికార టీఆర్‌ఎస్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్, రమేష్ రెడ్డి మరియు దేవీప్రసాద్ తదితరులు మంగళవారం డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సత్యవాణిని కలిసి ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ తన ప్రచారంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు తీసుకుని ఓటు వేయండి అని అవినీతికి పాల్పడేలా ప్రజలను, ఓటర్లను ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. ఎంపీ వ్యాఖ్యలు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతాయని, అందుకే ఆయనపై కఠిన చర్యలు తీసుకుని భారత రాజ్యాంగం గౌరవాన్ని నిలబెట్టాలని కోరారు.

బండి సంజయ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయనను మునుగోడులో ప్రచారం చేయకుండా నిషేధం విధించాలని టీఆర్‌ఎస్‌ నేతలు ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తిరుగుండ్లపల్లి రోడ్ షోలో బండి సంజయ్ ప్రసంగానికి సంబంధించిన వీడియో ఫుటేజీతో కూడిన పెన్ డ్రైవ్‌ను కూడా సమర్పించిన వారు, దీనిపై ఈసీ దృష్టి సారించి బండి సంజయ్ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా అతనికి ఆదేశాలు జారీ చేయడంతో సహా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు దీనిపై స్పందించిన బండి సంజయ్, మునుగోడు ఉప ఎన్నికల్లో విజయంపై అధికార పార్టీకి నమ్మకం లేదని, అందుకే ఎన్నికను వాయిదా వేయడానికి టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =