యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఆదివారాలు లాక్‌డౌన్ విధింపు

Coronavirus, Covid surge, COVID-19, Lockdown imposed in UP on Sunday, Lockdown in UP on Sunday, Mango News, Rs 1000 Fine for Not Wearing Mask, Sunday lockdown imposed in Uttar Pradesh, Sunday lockdown in Uttar Pradesh, UP announces Sunday lockdown, UP Govt Decides to Impose Lockdown on Sundays, UP Sunday Lockdown, Uttar Pradesh announces lockdown on Sunday, Uttar Pradesh Imposes Weekend Lockdown

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గురువారం నాడు ఒక్కరోజే 22339 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో ప్రతి ఆదివారం లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ లాక్‌డౌన్ ఆంక్షలు శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు అమల్లో ఉండనున్నాయి. లాక్‌డౌన్ సమయంలో సినిమా హాళ్లు, మాల్స్, మార్కెట్లు, ఆడిటోరియంలు, కార్యాలయాలు, జిమ్‌లు మూసివేయబడతాయని చెప్పారు. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇస్తునట్టు ప్రకటించారు.

మరోవైపు మాస్క్ ధరించని వారికీ జరిమానా విషయంలో కూడా యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్క్ లేకుండా పట్టుబడిన వ్యక్తులకు మొదటిసారిగా రూ.1,000 మరియు రెండోసారి నుంచి రూ.10,000 జరిమానా విధించబడుతుందని పేర్కొన్నారు. యూపీలో కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్న 10 జిల్లాలలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నట్టు తెలిపారు. పాఠశాలలను మే 15 వరకు మూసివేస్తామని ప్రకటించారు. ఇక ఉత్తర్ ప్రదేశ్ లో ఇప్పటివరకు మొత్తం 7,66,360 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 6,27,032 మంది కరోనా నుంచి కోలుకోగా, 9,480 మంది మరణించారు. ప్రస్తుతం 1,29,848 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =