బీపీని పెంచేస్తున్న రిపోర్ట్

High BP,Report, increasing BP, W.H.O report about high BP

హై బీపీ.. అధిక ర‌క్త‌పోటుపై డ‌బ్ల్యూహెచ్‌వో ఇచ్చిన రిపోర్టు ఇప్పుడు అందరిలో షాక్‌ను కలిగిస్తోంది. అధిక ర‌క్త‌పోటుకు ప్ర‌తి అయిదుగురిలో నాలుగుమంది స‌రైన చికిత్స‌ను తీసుకోవడం లేద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. ప్ర‌పంచ‌దేశాలు బీపీ గురించి ప్రజలందరిలో చైత‌న్యాన్ని క‌లిగిస్తే.. 2023 సంవత్సరం నుంచి 2050 లోపు సుమారు కొన్ని కోట్ల మందిని బ్ర‌తికించుకోవ‌చ్చంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ త‌న రిపోర్టులో షాకింగ్ విషయాన్ని చెప్పుకొచ్చింది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా హైబీపీతో బాధ‌ప‌డుతున్న వారి గురించి తాజాగా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఓ రిపోర్టును విడుదల చేసింది. దీని ప్రకారం హైబీపీతో బాధ‌ప‌డుతున్న ప్ర‌తి అయిదు మందిలో .. నాలుగుమంది అసలు స‌రైన చికిత్స‌ తీసుకోవడం లేద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. అయితే బీపీ..బీపీ వల్ల నష్టాల గురించి ఆ దేశాలు ప్రజల్లో చైత‌న్యాన్ని క‌లిగిస్తే, 2023వ సంవత్సరం నుంచి 2050 లోపు సుమారు 7.6 కోట్ల మందిని బ్ర‌తికించుకోవ‌చ్చని చెప్పింది. అంతేకాదు ఇండియాలో ఎక్కువ శాతం మ‌ర‌ణాల‌కు హై బీపీనే ముఖ్య కార‌ణ‌మంటూ రిపోర్టులో మరో విషయాన్ని చెప్పిన డబ్ల్యూహెచ్‌వో.. భారతీయులకు ఈ భయంకరమైన నిజాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది.

అలాగే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌తి ముగ్గురు వృద్ధుల్లో.. ఒక‌రికి హైప‌ర్‌టెన్ష‌న్ తప్పకుండా ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో రిపోర్టులో తెలిపింది. హైబీపీ వ‌ల్ల హార్ట్ స్ట్రోక్‌, హార్ట్ అటాక్‌, హృద్రోగ స‌మ‌స్య‌లు, కిడ్నీ డ్యామేజ్ లాంటి స‌మ‌స్య‌లు కూడా పెరగడం లేదా రావడం వంటివి జరుగుతున్నాయని చెప్పింది. బీపీ 140/90 mmHg లేదా అంత‌కంటే ఎక్కువగా బీపీ ఉన్న వ్యక్తులు 1990 నుంచి 2019 వ‌ర‌కు చూసుకుంటే ఏకంగా రెండింత‌లు పెరిగిన‌ట్లు రిపోర్టులో వెల్ల‌డించింది. అంటే బీపీ బాధితుల సంఖ్య 65 కోట్ల నుంచి 103 కోట్ల‌కు చేరుకున్న‌ట్లు తెలిపింది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా బ్లడ్ ప్రెషర్‌తో బాధపడుతున్న స‌గం మందికి …త‌మ ప్ర‌స్తుత ప‌రిస్థితి తెలియ‌ద‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పుకొచ్చింది. వృద్ధాప్యం, జ‌న్యు స‌మ‌స్య‌లు ఉన్న‌వారిలో హైబీపీ సమస్య మ‌రింత ఎక్కువగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ గుర్తించింది. అయితే దీనికి చెక్ పెట్టడానికి బ‌ల‌వ‌ర్ద‌క‌మైన ఆహారం తీసుకోవడంతో పాటు…పొగాకు అలవాటు ఉంటే దానిని మానేస్తే ర‌క్త‌పోటును అదుపులో ఉంచుకోవ‌చ్చని తెలిపింది. నిత్యం వ్యాయమాలు చేయడం, కూర్చొని ఉండకుండా ఏదొక పని చేస్తూ ఉండటం వల్ల కూడా హై బీపీని నియంత్రణలో ఉంచుకోవచ్చని చెప్పింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =