వైఎస్సార్ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం

AP Govt Invites Entries For The Awards of YSR Lifetime Achievement and YSR Achievement-2022 Before Sep 30, YSR Lifetime Achievement, YSR Achievement-2022,AP Government Accepting Applications For YSR Awards, AP Government Applications For YSR Awards, AP Government YSR Awards, YSR Awards, Mango News, Mango News Telugu, AP Government YSR Award, YSR Awards Latest News And Updates, AP CM YS Jagan Mohan Reddy, YS Jagan on YSR Awards, YS Jagan Pension Hike, AP Government YS Jagan YSR Awards, AP Government News And Live Updates, YSR Awards

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు మీద ప్రభుత్వం అందజేయనున్న రెండు ‘వైఎస్సార్’ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించినట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీ సమాచార, పౌరసంబంధాల కమిషనర్‌ టి. విజయ్‌ కుమార్‌ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. దీనిపై విధివిధానాలను నిర్ణయించడానికి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి హైపవర్‌ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశమైనట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30వ తేదీ లోపు అనేక రంగాలలో ఉత్తమ సేవలను అందించిన వ్యక్తులు మరియు సంస్థల నుండి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు ‘వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ మరియు వైఎస్సార్ అచీవ్‌మెంట్-2022’ అందజేయడానికి ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్లు విజయ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళాభ్యుదయం, సామాజికన్యాయం మొదలైన అంశాలకు సంబంధించి పాలుపంచుకుంటున్న వ్యక్తులు, సంస్థల నుంచి వరుసగా రెండో రోజు ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్లు విజయ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. దరఖాస్తు చేయాలనుకునేవారు వారి ఎంట్రీలను వారి బయో-డేటాతో పాటు ‘[email protected]’ అనే అధికారిక వెబ్‌సైట్‌లో సమర్పించాలని చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 1న ఈ రెండు అవార్డులను అందజేయనున్నట్లు వెల్లడించారు. కాగా ‘వైఎస్‌ఆర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు కింద రూ. 10 లక్షల నగదు, వైఎస్ఆర్ కాంస్య విగ్రహం, మెమెంటో, ప్రశంసా పత్రం అందిస్తామని, అలాగే ‘వైఎస్ఆర్ అచీవ్‌మెంట్’ అవార్డు రూ. 5 లక్షల నగదు, మెమెంటో, ప్రశంసా పత్రం అందజేస్తామని విజయ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here