తెలంగాణలో మరో ఆరు నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు, బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి – బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

BJP State President Bandi Sanjay Says Assembly Elections Likely to be Held in Next Six Months in Telangana, Bandi Sanjay Says Assembly Elections Likely to be Held in Next Six Months in Telangana, Assembly Elections Likely to be Held in Next Six Months in Telangana, Telangana Assembly Elections, BJP State President Bandi Sanjay, Bandi Sanjay About Telangana Assembly Elections, Assembly Elections 2023, MP Bandi Sanjay, Assembly Elections, Telangana Assembly Elections News, Telangana Assembly Elections Latest News And Updates, Telangana Assembly Elections Live Updates, Mango News, Mango News Telugu

తెలంగాణలో మరో ఆరు నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు జరగొచ్చని, బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ మేరకు ఆయన శనివారం 119 నియోజకవర్గాలోని బీజేపీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. ఇక కార్యక్రమంలో భాగంగా సంజయ్ ‘సరల్’ యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్‌లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తుంటామని వివరించారు. అలాగే కేంద్రప్రభుత్వం వివిధ పథకాల కింద రాష్ట్రానికి అందించే నిధుల వివరాలు కూడా ఉంటాయని, వీటన్నంటినీ ప్రజల్లోకి తీసుకెళ్లి వాస్తవాలు తెలియజేయాలని సంజయ్ పోలింగ్ బూత్ కమిటీ సభ్యులకు సూచించారు.

ఇక ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో మరో 6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. దీనికోసం పార్టీ ఇప్పటినుంచే సమాయత్తం కావాలని, గ్రౌండ్ లెవెల్లో ఓటర్లను ఆకర్షించాలని సూచించారు. ఇక పార్టీకి పోలింగ్ బూత్‌ స్థాయి కమిటీలే మూలమని, వీటి ద్వారానే పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఉపాధి హామీ, గ్రామా పంచాయితీలకు కేంద్రం ఇస్తున్న నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లిస్తోందని, దీనికి సంబంధించి లెక్కలు చెప్పాలని ఆయన సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. అలాగే రైతుల రుణాలు మాఫీ చేయకపోవడంతో ‘రైతు బంధు’ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నగదును బకాయిల కింద బ్యాంకులు జమ చేసుకుంటున్నాయని, దీనిపై సీఎం కేసీఆర్ ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారేనని, అందులో ఎలాంటి అనుమానం లేదని బండి సంజయ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 2 =