అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌గా ఎన్నికైన రిపబ్లికన్ సభ్యుడు కెవిన్ మెకార్థీ, 15వ రౌండ్‌లో తేలిన ఫలితం

Republican Leader Kevin Mccarthy Elected As Speaker For The US House Of Representatives In 15Th Round, Kevin Mccarthy Elected As Speaker For The US House Of Representatives In 15Th Round, Speaker For The US House Of Representatives In 15Th Round, Republican Leader Kevin Mccarthy, US House Speaker, Kevin Mccarthy Wins US House Speakership, GOP leader Kevin McCarthy, US House Of Representatives, 15Th Round, US House Speaker News, US House Speaker Latest News And Updates, US House Speaker Live Updates, Mango News, Mango News Telugu

గత నాలుగు రోజులుగా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ పదవి ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు కెవిన్ మెకార్థీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అయితే ఆయన ఛాంబర్‌కు నాయకత్వం వహించడానికి అసమ్మతివాదుల వ్యతిరేకతను ఈరోజు అధిగమించారు. ఈ క్రమంలో ఆయన 55వ హౌస్ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. కాగా 15 రౌండ్ల ఓటింగ్ తర్వాత ఈ ఫలితం వెలువడటం విశేషం. దీంతో గడచిన 100 సంవత్సరాలలో అమెరికాలో స్పీకర్‌ పదవికి ఎక్కువ రౌండ్లు నిర్వహించిన ఓటింగ్‌గా ఈ ఎన్నిక చరిత్ర సృష్టించింది. పోలైన 428 ఓట్లలో మెకార్థీ 216 ఓట్లు సాధించగా.. డెమోక్రాట్ల అభ్యర్థి హకీమ్ జెఫ్రీస్‌కు 212 ఓట్లు వచ్చాయి.

ఈ క్రమంలో అధికార డెమోక్రటిక్ పార్టీకి చెందిన నాన్సీ పెలోసీ స్థానంలో మెకార్థీ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా అంతకుముందు మెకార్థీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన మరో రిపబ్లికన్ సభ్యుడు మాట్ గేట్జ్ స్పీకర్‌ పదవికి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుని సూచించారు. అయితే ఆశ్చర్యకరంగా ఓటింగ్‌లో ట్రంప్‌కు కేవలం ఒక్క ఓటు వచ్చింది. అది కూడా మాట్ గేట్జ్ వేసిన ఓటే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో స్పీకర్‌గా ఎన్నికైన కెవిన్ మెకార్థీకి డొనాల్డ్ ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. ఇక అమెరికాలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు పదవుల తర్వాత స్పీకర్‌కు అంతటి హోదా ఉంటుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 3 =